బొంగులో వార్త:
తన మాజీ బాయ్ ఫ్రెండ్ తనను మోసం చేశాడని, రేప్ చేశాడని ఓ పాతికేళ్ల అమ్మాయి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ముంబై శాంతానగర్ పోలీసులు అతన్ని సోమవారం అరెస్టు చేశారు. ఫిర్యాదు చేసిన అమ్మాయి కండివ్లీలో చార్టర్డ్ అకౌంటెన్సీ విద్యార్థిని. పెళ్లి చేసుకుంటానని చెప్పి భావిక్ లింబాడ్ తన సాన్నిహిత్యం పెంచుకున్నాడని, తనను మోసం చేసి మరో అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడ్డాడని ఆమె ఆరోపించింది.
లింబాడ్ను అరెస్టు చేశామని పోలీసులు చెప్పారు. ఐపిసి 376, 420 సెక్షన్ల కింద అతనిపై కేసులు నమోదు చేశామని చెప్పారు. బాధితురాలని వైద్య పరీక్షలకు పంపించారు. పరీక్షలకు సంబంధించిన నివేదికలు రావాల్సి ఉంది.
బాధితురాలు రాజస్థాన్‌కు చెందిన అమ్మాయి. ఆమె రెండేళ్ల క్రితం ముంబై వచ్చింది. కండివాలి తూర్పులోని ఆకుర్లి రోడ్డులో ఆమె నివాసం ఉంటోంది. చార్టర్డ్ అకౌంటన్సీ కోర్సు ప్రిపరేషన్ కోసం ఆమె కోచింగ్ క్లాసులకు వెళ్తూ ఉంటుంది. అక్కడే లింబాడ్ ఆమె సాన్నిహిత్యం పెంచుకున్నాడు. అతను పెళ్లి చేసుకుంటానని ఆమెకు హామీ ఇచ్చాడని, దాంతో వారిద్దరి మధ్య శారీరక సంబంధం కూడా ఏర్పడిందని పోలీసులు చెప్పారు. అయితే, లింబాడ్ ఈ అమ్మాయిని వదిలేసి, మరో అమ్మాయితో పెళ్లికి సిద్ధపడ్డాడు. అతను మోసం చేయడంతో బాధితురాలు రెండు సార్లు ఆత్మహత్యా యత్నానికి కూడా పాల్పడింది. ఆ తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేసింది.

No comments:
Post a Comment