PLEASE FEEL FREE TO CLICK ON THE ADS! --- దయ చేసి భయపడకుండా ప్రకటనల మీద క్లిక్ చేయగలరు

Wednesday, May 30, 2012

టెన్నిస్ బంతుల పాప బంతులకి ఇక అంతటి ఊపు లేదు ....

బొంగులో వార్త:

Saniaఫ్రెంచ్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్లో భారత స్టార్ ప్లేయర్ సానియా మీర్జా జోడీకి ఆరంభంలోనే చుక్కెదురైంది. హైదరాబాద్ బ్యూటీ సానియా మీర్జా, ఆమె భాగస్వామి బెథానీ మాటెక్ శాండ్స్ (అమెరికా) మంగళవారం జరిగిన మహిళల డబుల్స్ తొలి రౌండ్‌లో 3-6, 6-4, 5-7 సెట్ల తేడాతో నినా బ్రచికోవా (రష్యా), ఎదీనా గాలోవిట్స్ హాల్ (రొమేనియా) జోడీ చేతిలో పరాజయం పాలై ఈ టోర్నమెంట్ నుంచి నిష్క్రమించారు. దీంతో లండన్ ఒలింపిక్స్‌లో పతకం సాధించాలన్న భారత్ ఆశలకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది.
మహిళల డబుల్స్ ప్రపంచ ర్యాంకింగ్స్‌లో ప్రస్తుతం వ్యక్తిగతంగా పదో స్థానంలో కొనసాగుతున్న సానియా మీర్జా లండన్ ఒలింపిక్స్ మహిళల డబుల్స్ డ్రాలో నేరుగా చోటు దక్కించుకోవాలంటే జూన్ 11తో ముగిసే కటాఫ్ తేదీ నాటికి టాప్-10లోనే నిలవాల్సి ఉంటుంది.
ఇంకా డబుల్స్‌లో సానియా 1,400 పాయింట్లు కాపాడుకుని టాప్-10 ర్యాంకింగ్స్‌లో కొనసాగితేనే లండన్ ఒలింపిక్స్ బరిలోకి దిగే అవకాశం ఉంటుంది. అయితే ఫ్రెంచ్ ఓపెన్ తొలి రౌండ్లో సానియా మీర్జా ఓటమి పాలవడం లండన్ ఒలింపిక్స్ అవకాశాలకు గండికొట్టినట్లయిందని క్రీడా పండితులు చెబుతున్నారు.
ఇక సానియా మీర్జా దుకాణం కట్టేసి ...... సినిమా ఫీల్డ్ ని నమ్ముకోవడం బెటర్

ఏ దేశమేగినా...మళ్ళీ అదే సోది

బొంగులో వార్త:

లండన్‌లో తెలంగాణపై చర్చ

London Nris Conduct Debate తెలంగాణ ఎన్నారై ఫోరం ఆధ్వర్యంలో ఈ నెల 27వ తేదీ ఆదివారం సాయంత్రం ఆరు గంటలకు లండన్‌లో తెలంగాణ చర్చా వేదికను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బ్రిటన్‌లోని వివిధ ప్రాంతాలకు చెందిన తెలంగాణ ఎన్నారైలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ జెఎసి హైదరాబాద్ చైర్మన్ డాక్టర్ ఎ శ్రీధర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

డాక్టర్ శ్రీధర్ తెలంగాణ ఉద్యమంలో ఎన్నారైల పాత్రను కొనియాడారు. అన్ని తెలంగాణ సంస్థలు, సమన్వయం, సహకారాలతో, ఐక్యతతో తెలంగాణ ఉద్యమంలో కలసి పనిచేయాలని ఆయన సూచించారు. అవసరమైనప్పుడు ఎన్నారైలు వచ్చి ఉద్యమంలో ప్రత్యక్షంగా పాల్గొనాలని కోరారు. పరకాల ఉప ఎన్నికలో తెలంగాణవాదులకే ఓటేయాలని ఆయన పిలుపునిచ్చారు.
తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) ఎన్నారై విభాగం అధ్యక్షుడు అనిల్ కూర్మాచలం కూడా మాట్లాడారు. ఉద్యమంలో పాల్గొన్నవారికే కష్టాలు, బాధలు, విమర్శలు అని ఆయన అన్నారు. వాటిని ఓర్పు, సహనంతో తట్టుకోవాలని ఆయన సూచించారు.
తెలంగాణ ఎన్నారై ఫోరం కార్యక్రమాలను, భవిష్యత్తు కార్యాచరణను శ్రీధర్ పవర్ ప్లే ప్రజెంటేషన్ ద్వారా వివరించిట్లు తెలంగాణ ఎన్నారై ఫోరం ప్రతినిధి గంప వేణుగోపాల్ ఓ ప్రకటనలో తెలిపారు. తెలంగాణ ఎన్నారై ఫోరం ప్రతినిధులు పి. వెంకట్, వేణదు అంకం, తుకారాం, మధు, వెంకమల్ల వెంకట్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

జగన్ పై సి బి ఐ విచారణ తో తిండి మానేసిన చిన్నారి ...!!

బొంగులో వార్త:

Saturday, May 5, 2012

అరేబియా సముద్రం లో లాడెన్ డెడ్ బాడీ !?

బొంగులో వార్త:


Osamaఅమెరికా సైన్యంచే హత్యకు గురైన అంతర్జాతీయ ఉగ్రవాది ఒసామా బిన్ లాడెన్ మృతదేహాన్ని కనుగొన్నట్లు నిధి అన్వేషకుడు బిల్ వారెన్ ప్రకటించడం సంచలనం సృష్టిస్తోంది. ఒసామా బిన్ లాడెన్ గత ఏడాది మే రెండో తేదీన అమెరికా నేవీ దళానికి చెందిన సీల్ విభాగం జరిపిన మెరుపు దాడిలో హతమైన విషయం తెల్సిందే. పాకిస్థాన్‌లోని అబొట్టాబాద్‌లోని తన నివాసంలో ఉండగా ఈ దాడి జరిగింది. అనంతరం ఒసామా మృతదేహాన్ని సముద్రంలో విసిరేసినట్లు అమెరికా వెల్లడించింది.

ఈ నేపథ్యంలో ప్రముఖ నిధి నిక్షేపాల అన్వేషకుడు బిల్లా వార్రెన్.. అమెరికా సముద్రంలో విసిరిన ఒసామా మృతదేహంతో కూడిన బ్యాగ్‌ను కనుగొన్నట్లు తెలిపారు. ఒసామా మృతదేహాన్ని ఇప్పటికే కనుగొన్నట్లు తెలిపిన వారెన్, ఆతడి మృతదేహాన్ని వెలికితెచ్చేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు.

గుజరాత్ రాష్ట్రం సూరత్ నుంచి పశ్చిమ అరేబియా సముద్రం అడుగు భాగంలో 320 కి.మీ దూరంలో ఒసామా

Friday, May 4, 2012

ఆస్ట్రేలియా గర్ల్‌తో ఒబామా డేటింగ్ ....!!

బొంగులో వార్త:

 Barack Obama S Affair Becomes Rave In Australia  ఆమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా 1980లలో న్యూయార్క్‌లో ఓ ఆస్ట్రేలియన్ అమ్మాయితో చెట్టాపట్టాల్ వేశారట. కొంతకాలం ఆమెతో ప్రేమాయణం సాగించారట. సదరుఆస్ట్రేలియా అమ్మాయితో ఒబామా ప్రేమకలాపం త్వరలోనే ఓ పుస్తక రూపంలో వెలుగులోకి రానుంది. బరాక్ ఒబామా: ది స్టోరి పేరిట అప్పట్లో ఆయనతో ప్రేమాయణం సాగించిన జెనెవియవ్ కుక్ డైరీ ఆధారంగా డేవిడ్ మారానిస్ అనే రచయిత పుస్తకం రాస్తున్నారు.

ఒబామాతో ప్రేమాయణం సాగించిన కుక్ అతని కంటే మూడేళ్లు పెద్దది. ఆస్ట్రేలియా దౌత్యాధికారు కుమార్తె. ఒబామాతో సాగించిన ప్రేమాయణాన్ని ఆమె డైరీల్లో భద్రపర్చుకుంది. ఇప్పుడు ఆ రహస్య డైరీ పుస్తక రూపంలో రానుంది. ఈ డైరీ ఆధారంగా పుస్తకం రాస్తున్న డేవిడ్ వీరిద్దరి ప్రేమానుబంధంపై లోలోతు వివరాల్ని సైతం వివరిస్తున్నారట. దీంతో వీరి ప్రేమాయణంపై తాజాగా వేడి వేడి చర్చ జరుగుతోంది.

ది వ్యానిటీ ఫెయిర్ అనే మ్యాగజైన్ పుస్తకంలోని కుక్ డైరీల సారాంశంలోని కొన్నింటిని వెలుగులోకి తెచ్చింది. పుస్తకం వివరాల ప్రకారం.. ఒబామా, కుక్‌లు 1983 డిసెంబరులో న్యూయార్క్‌లోని ఈస్ట్ జోన్ విలేజ్‌లో క్రిస్‌మస్ పార్టీలో కలుసుకున్నారు. ఆమె వయస్సు అప్పుడు 25. ఒబామా వయస్సు ఇరవై రెండేళ్లు. ఓ రోజు తామిద్దరం విందు చేసుకున్నామని, ఆయన పడక గదికి వెళ్లి మాట్లాడుకున్నామని, ఆ రాత్రి అక్కడే గడిపానని, అదంతా ఓ తప్పనిసరి పరిస్థితుల్లో జరిగిపోయిందని కుక్ తన డైరీలో రాసుకున్నారు.

కుక్, ఒబామా 1985లో విడిపోయారు. కాగా న్యూయార్క్, షికాగోలో కూడా తనకు పలువురు గర్ల్ ఫ్రెండ్స్ ఉండేవారని, వారందరి లక్షణాలు కుక్‌లో ఉండేవని ఒబామా తన వద్ద చెప్పినట్లు పుస్తక రచయిత చెబుతున్నారట.

Tuesday, May 1, 2012

నాకు రాజకీయాలు వద్దు .....సచిన్

బొంగులో వార్త:


 క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్, రాజ్యసభ తన నామినేషన్ తరువాత మొదటి సారి మాట్లాడుతూ, భారతదేశం ప్రెసిడెంట్ ద్వారా వచ్చిన గౌరవం తిరస్కరించ లేదని అన్నారు. ఎందుకంటే నేను క్రీడా రంగానికి చెందిన వ్యక్తినే కానీ రాజకీయనాయకుడు కాదని అన్నారు. నా జీవితంలో భారత్‌కు ప్రపంచ కప్‌ని గెలవడమే మధుర క్షణాలన్నాడు.

మంగళవారం పూణెలో ఓ కార్యక్రమానికి హాజరైన సచిన్ టెండూల్కర్‌ని రాజ్య సభ నామినేషన్ వ్యాఖ్యానించిన కోరగా అందుకు సచిన్ నవ్వి సమాధానంగా "ఇది నాకు ఒక ‌బౌన్సర్‌లా ఉంది". భారతదేశపు ప్రెసిడెంట్ ప్రతిభా పటేల్ ఇచ్చిన ఈ అరుదైన గౌరవాన్ని నేను తిరస్కరించ లేదు. అందుకు కారణం నేను రాజకీయ నాయకుడు కాదు ఒక స్పోర్ట్స్ పర్సన్‌ని. నేను క్రికెట్ విడిచి పెట్టను, నేను క్రికెట్ ఆడతూనే ఉంటాను. క్రికెటేనా జీవితం అని సచిన్ టెండూల్కర్ అన్నారు.

రాజకీయాల్లో చేరే ఉద్దేశం లేదని మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ స్పష్టం చేశారు. టెండూల్కర్‌ను రాజ్యసభకు నామినేట్ చేయడంపై వివాదం నెలకొన్న నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. అంతర్జాతీయ క్రికెట్‌లో భారత కీర్తి ప్రతిష్టతలను ఇమడింపజేసిన క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ రాజ్యసభ సభ్యుడుగా ఎంపికపై గాన కోకిల లతా మంగేష్కర్ హర్షం వ్యక్తం చేశారు. రాజ్యసభ సభ్యత్వం పొందేందుకు సచిన్ అన్నివిధాలా అర్హుడని ఆమె కితాబిచ్చారు. సచిన్‌కు కొంత సమయమిస్తే సచిన్ మంచి పార్లమెంటేరియన్‌గా నిరూపించుకుంటాడని ఆమె విశ్వాసం వ్యక్తం చేశారు.

39 ఏళ్లకే క్రీడా విభాగంలో రాజ్యసభకు ఎంపికైన మొదటి వ్యక్తిగా సచిన్ టెండూల్కర్ రికార్డు సృష్టించాడు. సచిన్‌ని రాజ్యసభకు నామినేట్ చేయడంపై మీ స్పందన ఏంటని ప్రశ్నించగా.. నిజం చెప్పాలంటే ఈ విషయం నాకు ఆశ్చర్యాన్ని కలగజేసింది. మొదట ఎలాంటి సమాచారం లేకుండా నామినేషన్‌ వివరాలు బయటకు‍‌ వస్తే సచిన్

Popular Posts

Desclaimer: Please note this Blog is only video embeddeding Blog. all of the news articles, videos and photos found here come from 3rd party video and news hosting sites. We do not host any of the videos and news articles. Please contact us through mail for any copyright issues.