బొంగులో వార్త:
అమెరికా సైన్యంచే హత్యకు గురైన అంతర్జాతీయ ఉగ్రవాది ఒసామా బిన్ లాడెన్ మృతదేహాన్ని కనుగొన్నట్లు నిధి అన్వేషకుడు బిల్ వారెన్ ప్రకటించడం సంచలనం సృష్టిస్తోంది. ఒసామా బిన్ లాడెన్ గత ఏడాది మే రెండో తేదీన అమెరికా నేవీ దళానికి చెందిన సీల్ విభాగం జరిపిన మెరుపు దాడిలో హతమైన విషయం తెల్సిందే. పాకిస్థాన్‌లోని అబొట్టాబాద్‌లోని తన నివాసంలో ఉండగా ఈ దాడి జరిగింది. అనంతరం ఒసామా మృతదేహాన్ని సముద్రంలో విసిరేసినట్లు అమెరికా వెల్లడించింది.
ఈ నేపథ్యంలో ప్రముఖ నిధి నిక్షేపాల అన్వేషకుడు బిల్లా వార్రెన్.. అమెరికా సముద్రంలో విసిరిన ఒసామా మృతదేహంతో కూడిన బ్యాగ్‌ను కనుగొన్నట్లు తెలిపారు. ఒసామా మృతదేహాన్ని ఇప్పటికే కనుగొన్నట్లు తెలిపిన వారెన్, ఆతడి మృతదేహాన్ని వెలికితెచ్చేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు.
గుజరాత్ రాష్ట్రం సూరత్ నుంచి పశ్చిమ అరేబియా సముద్రం అడుగు భాగంలో 320 కి.మీ దూరంలో ఒసామా
మృతదేహంతో కూడిన బ్యాగ్ ఉన్నట్లు గుర్తించినట్టు తెలిపారు. వచ్చే జూన్ ఒకటో తేదీ నుంచి మృతదేహాన్ని వెలికితెచ్చే వేటలో నిమగ్నం కానున్నట్లు వారెన్ ప్రకటించారు. ఇందుకు మూడు వారాల సమయం పడుతుందని వారెన్ వెల్లడించారు. ఒసామా మృతదేహాన్ని వెతుకులాట కోసం రెండు లక్షల డాలర్ల వరకు అవసరం అవుతాయని చెప్పాడు.
దేశభక్తితో కూడిన తన లాంటి అమెరికన్‌కు ఒసామా మృతిచెందాడనేందుకు తగిన ఆధారాలు ఇచ్చేందుకు ఒబామా ప్రభుత్వం వెనక్కి తగ్గిందని వారెన్ ఆరోపించారు. ప్రస్తుతం అజర్‌బైజాన్ నుంచి తన పనులను మొదలెట్టనున్న వారెన్, బిన్ లాడెన్ మృతదేహాన్ని వెతుకులాడటం కోసం ఓ షిప్‌ను కూడా సిద్ధం చేసుకున్నారు.
ఈ ఓడను మునిగేలా చేసేందుకు కూడా అమెరికా ప్రభుత్వం వెనుకాడబోదని ఆరోపించిన వారెన్.. తన పరిశోధన మొత్తాన్ని వీడియోగానో, ఫోటోలుగా తెస్తానని చెప్పారు. డీఎన్ఏ టెస్టులకు తర్వాత బిన్ లాడెన్ మృతదేహాన్ని తీసుకొచ్చే దిశగా ప్రణాళిక సిద్ధం చేసుకున్నట్లు వారెన్ తెలిపారు.
అమెరికా సైన్యంచే హత్యకు గురైన అంతర్జాతీయ ఉగ్రవాది ఒసామా బిన్ లాడెన్ మృతదేహాన్ని కనుగొన్నట్లు నిధి అన్వేషకుడు బిల్ వారెన్ ప్రకటించడం సంచలనం సృష్టిస్తోంది. ఒసామా బిన్ లాడెన్ గత ఏడాది మే రెండో తేదీన అమెరికా నేవీ దళానికి చెందిన సీల్ విభాగం జరిపిన మెరుపు దాడిలో హతమైన విషయం తెల్సిందే. పాకిస్థాన్‌లోని అబొట్టాబాద్‌లోని తన నివాసంలో ఉండగా ఈ దాడి జరిగింది. అనంతరం ఒసామా మృతదేహాన్ని సముద్రంలో విసిరేసినట్లు అమెరికా వెల్లడించింది.ఈ నేపథ్యంలో ప్రముఖ నిధి నిక్షేపాల అన్వేషకుడు బిల్లా వార్రెన్.. అమెరికా సముద్రంలో విసిరిన ఒసామా మృతదేహంతో కూడిన బ్యాగ్‌ను కనుగొన్నట్లు తెలిపారు. ఒసామా మృతదేహాన్ని ఇప్పటికే కనుగొన్నట్లు తెలిపిన వారెన్, ఆతడి మృతదేహాన్ని వెలికితెచ్చేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు.
గుజరాత్ రాష్ట్రం సూరత్ నుంచి పశ్చిమ అరేబియా సముద్రం అడుగు భాగంలో 320 కి.మీ దూరంలో ఒసామా
మృతదేహంతో కూడిన బ్యాగ్ ఉన్నట్లు గుర్తించినట్టు తెలిపారు. వచ్చే జూన్ ఒకటో తేదీ నుంచి మృతదేహాన్ని వెలికితెచ్చే వేటలో నిమగ్నం కానున్నట్లు వారెన్ ప్రకటించారు. ఇందుకు మూడు వారాల సమయం పడుతుందని వారెన్ వెల్లడించారు. ఒసామా మృతదేహాన్ని వెతుకులాట కోసం రెండు లక్షల డాలర్ల వరకు అవసరం అవుతాయని చెప్పాడు.
దేశభక్తితో కూడిన తన లాంటి అమెరికన్‌కు ఒసామా మృతిచెందాడనేందుకు తగిన ఆధారాలు ఇచ్చేందుకు ఒబామా ప్రభుత్వం వెనక్కి తగ్గిందని వారెన్ ఆరోపించారు. ప్రస్తుతం అజర్‌బైజాన్ నుంచి తన పనులను మొదలెట్టనున్న వారెన్, బిన్ లాడెన్ మృతదేహాన్ని వెతుకులాడటం కోసం ఓ షిప్‌ను కూడా సిద్ధం చేసుకున్నారు.
ఈ ఓడను మునిగేలా చేసేందుకు కూడా అమెరికా ప్రభుత్వం వెనుకాడబోదని ఆరోపించిన వారెన్.. తన పరిశోధన మొత్తాన్ని వీడియోగానో, ఫోటోలుగా తెస్తానని చెప్పారు. డీఎన్ఏ టెస్టులకు తర్వాత బిన్ లాడెన్ మృతదేహాన్ని తీసుకొచ్చే దిశగా ప్రణాళిక సిద్ధం చేసుకున్నట్లు వారెన్ తెలిపారు.
No comments:
Post a Comment