బొంగులో వార్త:
భారత్ అగ్ని-5 క్షిపణిని పరీక్షించి వారం రోజులు కూడా గడవకముందే పాకిస్తాన్ తాజాగా మరో అణు క్షిపణి పరీక్ష జరిపింది. మధ్యంతర స్థాయి ఖండాంతర క్షిపణి హతాఫ్-4 షహీన్-1ఎ ఆయుధ వ్యవస్థను పాకిస్తాన్ బుధవారం విజయవంతంగా పరీక్షించింది. పాకిస్తాన్ సైన్యం ఈ విషయాన్ని ప్రకటించింది. 'ఈ క్షిపణి షహీన్-1కు అత్యాధునిక రూపం. స్థాయిపరంగా, సాంకేతిక ప్రమాణాలను మరింత మెరుగుపర్చి షహీన్-1ఎను రూపొందించారు' అని ఈ ప్రకటన పేర్కొంది. ఇది భారత్‌లోని ఉత్తర, పశ్చిమ ప్రాంతాల్లో అన్ని ప్రధాన నగరాలపైకి దూసుకుపోగలదు. అణు, సాంప్రదాయ యుద్ధ శీర్షాలను ఈ క్షిపణి మోసుకుపోగలదు. అణు సామర్థ్యం గల షహీన్-1 క్షిపణి 750 కిలోమీటర్ల వరకు దూసుకుపోగలదు. అయితే, దీనిని మెరుగు పర్చి రూపొందించిన ప్రస్తుత క్షిపణి స్థాయిని మాత్రం సైన్యం వెల్లడించలేదు. అలాగే, ఈ క్షిపణిని ఎక్కడ నుంచి ప్రయోగించిందీ ఆ ప్రాంతాన్ని కూడా సైన్యం వెల్లడించలేదు. సముద్రం లోని లక్ష్యాన్ని ఇది చేరుకుందని పేర్కొంది. దేశాధ్యక్షుడు అసిఫ్ అలీ జర్దారీ, ప్రధానమంత్రి యూసుఫ్ రజా జిలానీ....ఈ క్షిపణిని విజయవంతంగా ప్రయోగించిన శాస్త్రవేత్తలు, సైన్యానికి అభినందనలు తెలిపారు. ఈ క్షిపణి పరీక్ష గురించి భారత్‌కు ముందే తెలియజేసిన పాకిస్తాన్ ఈ ప్రాంతంలో వెళ్ళే విమానాలకు తగిన హెచ్చరికలు పంపించాలని కోరింది. మార్చిలో పాకిస్తాన్ అణు సామర్థ్యం గల, స్వల్ప శ్రేణి, ఉపరితలం నుంచి ఉపరితలానికి దూసుకుపోయే ఖండాతర క్షిపణిని పరీక్షించిన విషయం తెలిసిందే.

No comments:
Post a Comment