బొంగులో వార్త:
ఏవీఎస్ ఆధ్వర్యంలో 'బ్లాగ్ బస్టర్ అవార్డ్సు'కు సన్నాహాలు జరుగుతున్నాయి. సోషల్ నెట్‌వర్క్ అయిన బ్లాగ్స్ ద్వారా ఈ అవార్డుల ఎంపిక ప్రక్రియ జరుగుతుందనీ, ఇటువంటి ప్రక్రియ మొట్టమొదటిసారిగా జరగడం ఆనందంగా ఉందని ఏవీఎస్ తెలియజేశారు. 'ఏవీఎస్ ఫిలిమ్.ఇన్'లోనికి వెళితే అవార్డుల గురించిన మరిన్ని వివరాలు తెలుస్తాయని ఆయన పేర్కొన్నారు. 2011 సంవత్సరంలో విడుదలైన 114 చిత్రాల్లోని 11 కేటగిరిలకుగాను ఈ అవార్డులు ఇవ్వనున్నట్టు, వీటిని ఐదుగురు జర్నలిస్టులచే కమిటీ ఏర్పాటు చేసినట్టు ఆయన తెలిపారు. మురళీమోహన్ మాట్లాడుతూ...'ఒకప్పుడు పత్రికలు అవార్డులు ఇస్తుండేవి. క్రమేణా టీవీ ఛానళ్ళు వచ్చాయి. ఇప్పుడు ఇంటర్‌నెట్‌ద్వారా అవార్డు ఇవ్వాలనే ప్రక్రియ చాలా కొత్తగా ఉంది' అని అన్నారు. దాసరి వ్యాఖ్యానిస్తూ...'నీరసంగా ఉన్న రోగికి ఇచ్చే ఇంజక్షనే అవార్డులు. ఒకప్పుడు అవార్డులకు చాలా గౌరవముండేది. క్రమేణా రాష్ట్ర, జాతీయస్థాయిలో అవార్డులు పైరవీలుచేసి కొందరు తెచ్చుకుంటున్నారు. పద్మశ్రీ, పద్మవిభూషణ్, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డులను పైరవీచేసేందుకు ఓ రాకెట్ నడుస్తోంది. ఇటువంటి సమయంలో సోషల్‌నెట్‌వర్క్ ద్వారా అవార్డులు ఇవ్వడం సాహసమే అవుతుంది. వీటిని నిస్పక్షపాతంగా ఇవ్వాలని' అని విజ్ఞప్తి చేశారు.

No comments:
Post a Comment