PLEASE FEEL FREE TO CLICK ON THE ADS! --- దయ చేసి భయపడకుండా ప్రకటనల మీద క్లిక్ చేయగలరు

Wednesday, May 30, 2012

ఏ దేశమేగినా...మళ్ళీ అదే సోది

బొంగులో వార్త:

లండన్‌లో తెలంగాణపై చర్చ

London Nris Conduct Debate తెలంగాణ ఎన్నారై ఫోరం ఆధ్వర్యంలో ఈ నెల 27వ తేదీ ఆదివారం సాయంత్రం ఆరు గంటలకు లండన్‌లో తెలంగాణ చర్చా వేదికను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బ్రిటన్‌లోని వివిధ ప్రాంతాలకు చెందిన తెలంగాణ ఎన్నారైలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ జెఎసి హైదరాబాద్ చైర్మన్ డాక్టర్ ఎ శ్రీధర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

డాక్టర్ శ్రీధర్ తెలంగాణ ఉద్యమంలో ఎన్నారైల పాత్రను కొనియాడారు. అన్ని తెలంగాణ సంస్థలు, సమన్వయం, సహకారాలతో, ఐక్యతతో తెలంగాణ ఉద్యమంలో కలసి పనిచేయాలని ఆయన సూచించారు. అవసరమైనప్పుడు ఎన్నారైలు వచ్చి ఉద్యమంలో ప్రత్యక్షంగా పాల్గొనాలని కోరారు. పరకాల ఉప ఎన్నికలో తెలంగాణవాదులకే ఓటేయాలని ఆయన పిలుపునిచ్చారు.
తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) ఎన్నారై విభాగం అధ్యక్షుడు అనిల్ కూర్మాచలం కూడా మాట్లాడారు. ఉద్యమంలో పాల్గొన్నవారికే కష్టాలు, బాధలు, విమర్శలు అని ఆయన అన్నారు. వాటిని ఓర్పు, సహనంతో తట్టుకోవాలని ఆయన సూచించారు.
తెలంగాణ ఎన్నారై ఫోరం కార్యక్రమాలను, భవిష్యత్తు కార్యాచరణను శ్రీధర్ పవర్ ప్లే ప్రజెంటేషన్ ద్వారా వివరించిట్లు తెలంగాణ ఎన్నారై ఫోరం ప్రతినిధి గంప వేణుగోపాల్ ఓ ప్రకటనలో తెలిపారు. తెలంగాణ ఎన్నారై ఫోరం ప్రతినిధులు పి. వెంకట్, వేణదు అంకం, తుకారాం, మధు, వెంకమల్ల వెంకట్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

3 comments:

Anonymous said...

bongu gallaku Telangana gurinchi ekkada news vacchina bongulo kalutundi...Picchi vaartalu

Anonymous said...

భారతీయులు భారత దేశంలో పనిచెయ్యడం తెలంగాణా వాళ్ళకి తప్పు కానీ అదే తెలంగాణా వాళ్ళు వేరే దేశంలో పనిచెయ్యడం తప్పు కాదు?
ఇదెక్కడి చోద్యం?
మా ఉద్యోగాలు మీరు దొబ్బుకు పోతున్నారు అని తెలంగాణా వాళ్ళు అరుస్తుంటారు,
మరి NRI లుగా మారిన తెలంగాణా వాదులు ఎవరి ఉద్యోగాలు దోచుకుపోవట్లేదా?

Anonymous said...

aata , tana antu chakkaga kula samaveshalu pettu kovali gani telangana samaveshalemiti

Popular Posts

Desclaimer: Please note this Blog is only video embeddeding Blog. all of the news articles, videos and photos found here come from 3rd party video and news hosting sites. We do not host any of the videos and news articles. Please contact us through mail for any copyright issues.