PLEASE FEEL FREE TO CLICK ON THE ADS! --- దయ చేసి భయపడకుండా ప్రకటనల మీద క్లిక్ చేయగలరు

Tuesday, May 1, 2012

నాకు రాజకీయాలు వద్దు .....సచిన్

బొంగులో వార్త:


 క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్, రాజ్యసభ తన నామినేషన్ తరువాత మొదటి సారి మాట్లాడుతూ, భారతదేశం ప్రెసిడెంట్ ద్వారా వచ్చిన గౌరవం తిరస్కరించ లేదని అన్నారు. ఎందుకంటే నేను క్రీడా రంగానికి చెందిన వ్యక్తినే కానీ రాజకీయనాయకుడు కాదని అన్నారు. నా జీవితంలో భారత్‌కు ప్రపంచ కప్‌ని గెలవడమే మధుర క్షణాలన్నాడు.

మంగళవారం పూణెలో ఓ కార్యక్రమానికి హాజరైన సచిన్ టెండూల్కర్‌ని రాజ్య సభ నామినేషన్ వ్యాఖ్యానించిన కోరగా అందుకు సచిన్ నవ్వి సమాధానంగా "ఇది నాకు ఒక ‌బౌన్సర్‌లా ఉంది". భారతదేశపు ప్రెసిడెంట్ ప్రతిభా పటేల్ ఇచ్చిన ఈ అరుదైన గౌరవాన్ని నేను తిరస్కరించ లేదు. అందుకు కారణం నేను రాజకీయ నాయకుడు కాదు ఒక స్పోర్ట్స్ పర్సన్‌ని. నేను క్రికెట్ విడిచి పెట్టను, నేను క్రికెట్ ఆడతూనే ఉంటాను. క్రికెటేనా జీవితం అని సచిన్ టెండూల్కర్ అన్నారు.

రాజకీయాల్లో చేరే ఉద్దేశం లేదని మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ స్పష్టం చేశారు. టెండూల్కర్‌ను రాజ్యసభకు నామినేట్ చేయడంపై వివాదం నెలకొన్న నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. అంతర్జాతీయ క్రికెట్‌లో భారత కీర్తి ప్రతిష్టతలను ఇమడింపజేసిన క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ రాజ్యసభ సభ్యుడుగా ఎంపికపై గాన కోకిల లతా మంగేష్కర్ హర్షం వ్యక్తం చేశారు. రాజ్యసభ సభ్యత్వం పొందేందుకు సచిన్ అన్నివిధాలా అర్హుడని ఆమె కితాబిచ్చారు. సచిన్‌కు కొంత సమయమిస్తే సచిన్ మంచి పార్లమెంటేరియన్‌గా నిరూపించుకుంటాడని ఆమె విశ్వాసం వ్యక్తం చేశారు.

39 ఏళ్లకే క్రీడా విభాగంలో రాజ్యసభకు ఎంపికైన మొదటి వ్యక్తిగా సచిన్ టెండూల్కర్ రికార్డు సృష్టించాడు. సచిన్‌ని రాజ్యసభకు నామినేట్ చేయడంపై మీ స్పందన ఏంటని ప్రశ్నించగా.. నిజం చెప్పాలంటే ఈ విషయం నాకు ఆశ్చర్యాన్ని కలగజేసింది. మొదట ఎలాంటి సమాచారం లేకుండా నామినేషన్‌ వివరాలు బయటకు‍‌ వస్తే సచిన్
టెండూల్కర్ ఈ నామినేషన్‌ని స్వీకరించడం నాకు మరింత ఆశ్చర్యాన్ని కలగజేసిందని అన్నాడు.

‘నాయకత్వం వహించడం సచిన్‌కు అంతగా తెలియదు. క్రికెట్‌లోనూ కాంట్రాక్టు వివాదం ఇతరత్రా సమస్యలు వచ్చినప్పుడు అతడు ముందుండి నడిపించలేకపోయాడు. అతడు క్రికెటర్‌గా, ఎంపీగా తన కెరీర్‌ను ఎలా బ్యాలెన్స్ చేసుకుంటాడో చూడాలి’ అని అన్నాడు. సచిన్‌ని దగ్గరగా గమనించిన వారిలో సచిన్ రిటైర్ మెంట్ తర్వాత క్రికెట్‌కు సంబంధించిన వ్యవహారాలను చూడడమో, కోచ్‌గా లేక బిజినెస్ మ్యాన్, సోషన్ బాధ్యతలను నిర్వహిస్తాడోనని అంచనా వేశావాడిని.

సచిన్ రాజ్యసభ సభ్యుడిగా పార్లమెంట్ సమావేశాలకు వెళ్లడానికి సమయం ఉంటుందో లేదో చూడాలన్నాడు.
ప్రస్తుతం ఇండియా ఆడిన ప్రతి గేమ్ లోనే సచిన్ ఆడడం లేదు. ముంబై రంజీ ట్రోఫీలో సచిన్ ఆడని విషయం తెలిసిందే. ప్రతి పార్లమెంట్ సెషన్‌కి వెళ్లేంత సమయం ఉండకపోవచ్చు. సచిన్‌ని రాజ్యసభ ఎంపిక నాకోక పెద్ద సర్ ప్రైజ్. ఐతే సచిన్ దీనికి అంగీకరిస్తాడని మాత్రం నేను భావించలేదు. సచిన్ పేరు చెప్పి కొందరు ప్రయోజనాలు పొందాలని చూస్తున్నారని మరో వ్యాఖ్యాత హర్షా బోగ్లే వ్యాఖ్యానించాడు.

ఇది ఇలా ఉంటే సచిన్ టెండూల్కర్‌ను రాజ్యసభకు నామినేట్ చేయడంపై వివాదం తగదని హాకీ ఒలింపియన్ అస్లామ్ షేర్‌ఖాన్ అన్నారు. అతని ఎంపిక విషయమై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నసందర్బంలో అస్లామ్ షేర్‌ఖాన్ మాట్లాడుతూ ‘సచిన్ వయసు 39 ఏళ్లు దాటింది. ఇంకా సుదీర్ఘకాలం అతను క్రికెట్ ఆడలేడు. ఇలాంటి పరిస్థితుల్లో కెరీర్ తర్వాత ఏదైనా చేయాలని అతడు నిర్ణయించుకోవడం సాధారణం. అయినా సచిన్ రాజ్యసభకు వెళ్లడం ఏమంత తగని పని కాదు... అనర్హుడూ కాదు. దీనిపై రాద్దాంతం అనవసరం’ అని అన్నారు.

1 comment:

anrd said...

సచిన్ చక్కగా ఆచితూచి మాట్లాడతారు.

Popular Posts

Desclaimer: Please note this Blog is only video embeddeding Blog. all of the news articles, videos and photos found here come from 3rd party video and news hosting sites. We do not host any of the videos and news articles. Please contact us through mail for any copyright issues.