PLEASE FEEL FREE TO CLICK ON THE ADS! --- దయ చేసి భయపడకుండా ప్రకటనల మీద క్లిక్ చేయగలరు

Wednesday, April 18, 2012

తాగు బోతులను అనాధలని చేసి వెళ్లి పోతున్న 'జానీ వాకర్'

బొంగులో వార్త: 
 మనకు ఇక 'జానీ వాకర్' లేదు .... మందు ప్రియులకు జానీ వాకర్ చేదు వార్త అందించిందిద. విశేష ప్రాచుర్యం పొందిన విస్కీ జానీ వాకర్ చివరి సీసాను నింపిసి కంపెనీని మూసేయడానికి సిద్ధపడ్డారు. బ్లాక్, రెడ్ లేబుల్ విస్కీ ప్రియులకు ఇది పెద్ద దెబ్బనే. స్కాట్లాండ్‌లోని కిల్మాన్‌కర్క్‌లోని జానీ వాకర్ తయారీ కర్మాగారాన్ని మూసేస్తున్నారు. ఈ కర్మాగారం 1820 నుంచి పనిచేస్తూ వస్తోంది. కర్మాగారాన్ని మూయకూడదని డీయాగియోకు నచ్చజెప్పడానికి స్కాటిష్ ప్రధాని అలెక్స్ సాల్మాండ్ నచ్చజెప్పడానికి చేసిన ప్రయత్నం ఫలించలేదు. జానీ వాకర్ కర్మాగారాన్ని మూసేస్తామని కంపెనీ 2009లోనే ప్రకటించింది. ఇందులో 700 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. వారిలో 430 మంది నష్టపరిహారంతో బయటకు వెళ్లడానికి అంగీకరించారు. మరో 200 మందిని ఇతర ఉద్యోగాల్లో నియమించుకుంటున్నారు. 82 మందిని తొలగించారు. చారిత్రాత్మకమైన జానీ వాకర్ చివరి సీసాను మ్యూజియంలో భద్రపరుస్తారు. వాకర్‌కు చెందిన కిల్మాన్‌రాక్ విస్కీ సీసాను 1820లో మొదటిసారి విక్రయించారు. జానీ వాకర్ ప్రపంచవ్యాప్తంగా పంపిణీ అవుతున్న అత్యంత ప్రాచుర్యం పొందిన బ్లెండెడ్ స్కాచ్ విస్కీ. ఏడాదికి 130 మిలియన్ సీసాలు అమ్ముడవుతూ వస్తున్నాయి.

2 comments:

cbrao said...

కిల్మార్నాక్ లో ఉన్న చారిత్రక, పురాతన జానీ వాకర్ ఉత్పాదక కర్మాగారం మాత్రం మూతపడుతుంది. ఇహ పై ఉత్పాదన
Leven, Fife, మరియు Shieldhall, Glasgow ల లో ఉన్న ఆధునిక కర్మాగారాలలో జరుగుతుంది. కిల్మార్నాక్ లో ఖర్చు పెరిగి నష్టం వస్తున్నందువలన ఈ నిర్ణయం యజమానులు తీసుకున్నారు. కిల్మార్నాక్ లో కర్మాగారం మూతపడినా జానీవాకర్ అభిమానులకు ఆ పానీయం ఇతర యునిట్ల నుంచి లభ్యమవగలదు.

cbrao said...
This comment has been removed by the author.

Popular Posts

Desclaimer: Please note this Blog is only video embeddeding Blog. all of the news articles, videos and photos found here come from 3rd party video and news hosting sites. We do not host any of the videos and news articles. Please contact us through mail for any copyright issues.