PLEASE FEEL FREE TO CLICK ON THE ADS! --- దయ చేసి భయపడకుండా ప్రకటనల మీద క్లిక్ చేయగలరు

Sunday, April 15, 2012

హీరో పవన్ కల్యాణ్‌ ను తోసేసిన ఫాన్స్...!! స్వల్ప గాయాలు

బొంగులో వార్త:

Panjaహీరో పవన్ కల్యాణ్‌కు స్వల్ప గాయాలయ్యాయి. ఆదివారం ఆయన దైవ దర్శనం కోసం విశాఖపట్నం చేరుకున్నారు. అక్కడ ఆయన సింహాద్రి అప్పన్న స్వామిని దర్శించుకున్నారు. పవన్ కల్యాణ్ వచ్చిన విషయం తెలిసి భారీగా ఆయన అభిమానులు అక్కడకు తరలి వచ్చారు. పవన్‌ను చూసేందుకు వారు ఎగబడ్డారు. ఈ క్రమంలో అభిమానుల మధ్య తోపులాట జరిగింది. దీంతో అక్కడ స్వల్ప తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో పలువురు కింద పడ్డారు.

ఈ తోపులాటలో హీరో పవన్ కల్యాణ్‌కు కూడా స్వల్పంగా గాయాలయ్యాయి. దీంతో పోలీసులు
లాఠీఛార్జ్ చేసి అభిమానులను చెదరగొట్టారు. కాగా అంతకుముందు పవన్ కల్యాణ్ చిత్తూరు జిల్లా తిరుపతి చేరుకున్నారు. అక్కడ తిరుమల శ్రీ వేంకటేశఅవర స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్‌ను మీడియా పలకరించింది. తాను సినిమాల గురించి ఏమీ మాట్లాడనని చెప్పారు.

గబ్బర్ సింగ్ సినిమా విషయమై ప్రేక్షకులే తీర్పు ఇస్తారని చెప్పారు. తనకు ఎప్పుడు కూడా సినిమాల గురించి మాట్లాడే అలవాటు లేదని చెప్పారు. గబ్బర్ సింగ్ ప్రేక్షకులకు నచ్చుతుందనే తాను భావిస్తున్నట్లు చెప్పారు. సినిమా గురించి తాను చెప్పడం కంటే అభిమానులు, ప్రేక్షకులు చెబితే బాగుంటుందని పవన్ కల్యాణ్ అభిప్రాయపడ్డారు.

కాగా విశాఖలో మ్యూజిక్ డైరెక్టర్ దేవీశ్రీ ప్రసాద్ మాట్లాడారు. సినిమాకు మంచి సాంగ్స్ ఇచ్చామని చెప్పారు. సినిమా తప్పక హిట్ అవుతుందన్న నమ్మకం తమకు ఉందని చెప్పారు. కాగా పవన్ కల్యాణ్ ప్రధానపాత్రలో నటించిన గబ్బర్ సింగ్ చిత్రం ఆడియో ఆదివారం సాయంత్రం విడుదలవుతున్న విషయం తెలిసిందే.
Gabbar Singh Trailer

No comments:

Popular Posts

Desclaimer: Please note this Blog is only video embeddeding Blog. all of the news articles, videos and photos found here come from 3rd party video and news hosting sites. We do not host any of the videos and news articles. Please contact us through mail for any copyright issues.