బొంగులో వార్త:
రాజమౌళి రూపొందిస్తున్న 'ఈగ' సినిమా సృష్టిస్తున్న సంచలనాలు అంతకంతకు పెరిగిపోతున్నాయట. తాజాగా విడుదలైన ఈ చిత్రం ట్రైలర్ యూ ట్యూబ్ లో సరికొత్త రికార్డును సృష్టించిందని చిత్ర నిర్మాతలు మీడియాకు ప్రెస్ నోట్ వదిలారు. టాలీవుడ్ టాప్ హీరోల రికార్డుల్ని ఈ సినిమా ట్రైలర్ వెనక్కు నెట్టేసిందట. ఇంతవరకు అందిన సమాచారం ప్రకారం 'గబ్బర్ సింగ్' ట్రైలర్ నెల రోజులకు 4,68,000, 'రచ్చ' ట్రైలర్ మూడు వారాలకు 5,03,000, 'దమ్ము' సినిమా ట్రైలర్ 8 రోజులకు 3,28,000 క్లిక్స్ సాధించగా, 'ఈగ' సినిమా ట్రైలర్ కేవలం 7 రోజుల్లో 5,63,000 క్లిక్స్ సాధించి, కొత్త రికార్డును కొట్టిందని చిత్రం వర్గాలు చెబుతున్నాయి. ఇలా యూ ట్యూబ్ ని తమ ట్రైలర్ షేక్ చేయడం పట్ల దర్శక నిర్మాతలు తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరి, రేపు సినిమా విడుదలయ్యాక మరెన్ని రికార్డులు కొడుతుందో!
No comments:
Post a Comment