బొంగులో సెటైర్:
ఒకప్పుడు కేవలం సర్కస్‌లోనే బఫూన్స్ కనపడుతూండేవాళ్లు. వాళ్లు అన్నీ కోతిచేష్టలు చేస్తూంటే ప్రజలంతా విరగబడి నవ్వేవాళ్లు.
ఇప్పుడు సర్కస్‌లే లేవు.
జంతువుల మీద అతి ప్రేమగల జీవకారుణ్య సంఘాలు, క్రూర జంతు సంరక్షణ సమితిలు, ఇంకా ఇలాంటి సవాలక్ష సంస్థలు బయల్దేరి సర్కస్‌లో జంతువులను హింసించరాదు. వాటికి శిక్షణ ఇవ్వడానికి వాటిని బాధించకూడదు లాంటి నినాదాలతో సర్కస్ కంపెనీల మీద దాడి చేసి వాటిని మూయించేసేవరకూ నిద్రపోలేదు.
కానీ ఈ సంస్థలేమీ రోజూ కొన్ని కోట్ల కోళ్లను తెగ నరికి వండుకు తినేవాళ్ల జోలికి పోవు. అమ్మవారికి బలి పేరుతో కోట్ల మేకలు, గొర్రెలను అతి కిరాతకంగా చంపి తినేవాళ్ల జోలికి పోవు.
ఎందుకంటే రోజూ వాళ్లకూ మటన్, చికెన్, ఫిష్, రొయ్యలు, పీతలు కావాలి. నిత్యం ఎన్ని వేల కోళ్లను, మేకలను ఎలా ఎంత క్రూరంగా చంపుతారో అందరికీ తెలుసు.
అయినా సరే! సైలెన్స్! ఎందుకంటే మటన్, చికెన్ బిరియానీలు మనకిష్టం!
‘సరే - సర్కస్‌లే లేవు గనుక ఆ బఫూన్లు కూడా కరువయి పోయారు’ అని ప్రజలంతా ఫీలవుతోంటే ప్రభుత్వం వెంటనే మనందరి ఎంటర్‌టైన్‌మెంట్ కోసం బఫూన్స్‌ని ఏర్పాటు చేసింది. మనకి ఆ బఫూన్లు ఎంత చక్కని ఎంటర్‌టైన్‌మెట్ అందిస్తున్నారో చూడండి. ఫరెగ్జాంపుల్ - కేంద్ర హోంమంత్రి సడెన్‌గా అర్ధరాత్రి నిద్రలేచి ఒక టీవీ ఛానెల్‌కెళ్లి ప్రజలను హెచ్చరిస్తాడు.
‘ఇప్పుడే మాకు ఇన్‌ఫర్మేషన్ అందింది. అల్‌ఖైదా టెర్రరిస్ట్‌లు కొంతమంది పాకిస్తాన్ వేపు సరిహద్దులు దాటి భారతదేశంలోకి ప్రవేశించారు. వాళ్లు ఏ మెట్రో నగరంలోనయినా, ఏ క్షణాన్నయినా విధ్వంసానికి పాల్పడవచ్చు. ప్రజంతా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నాం.’
అప్రమత్తంగా ఉండాలంటే ఏం చేయాలో, ఎంతకాలం అలా ఉండాలో ఆయనగారు చెప్పడు. మీరు భయపడకండి! టెర్రరిస్టులను మన పోలీసులు మట్టి కరిపిస్తారనే మాటే ఉండదు - సడెన్‌గా డీజీపీ టీవీ స్క్రీన్ మీదకొస్తాడు.
‘టెర్రరిస్ట్‌లు హైద్రాబాద్, సికిందరాబాద్ రైల్వేస్టేషన్లలో బాంబ్‌లు వేయబోతున్నారని ఇప్పుడే మాకు సమాచారం అందింది. జాగ్రత్త - ఛస్తారు’ అంటూ వార్నింగ్ ఇస్తాడు.
దాంతో అందరూ టెర్రరైజ్ అయిపోతారు. చాలామంది ప్రయాణాలు కాన్సిల్ చేసుకుంటారు. రైళ్లూ బస్‌లూ అన్నీ ఖాళీ..
నిజానికి ప్రజల్ని అలా హడలెత్తించాల్సిన అవసరం ఆ అధికారులకు లేదు.
ప్రజల క్షేమంగా ప్రయాణాలు చేయడానికి అవసరమయిన ఏర్పాట్లు చేయడానికే పోలీసు బలగాలున్నాయ్ - అయినా అది గాలికొదిలేసి ప్రజల్ని ఠారెత్తిస్తారు.
ఇక ఆరోగ్య మంత్రి ఇంకో వార్నింగిస్తాడు.
‘మినరల్ వాటర్ పేరుతో మార్కెట్లో అమ్ముతోన్న వాటర్ బాటిల్స్‌లో అధిక శాతం కలుషితమయిన నీరే. తాగకండి. కుక్క ఛావు ఛస్తారు’
నిజానికి ఆయన చేయాల్సిందిలా ప్రజలను భయపెట్టడం కాదు - అలాంటి కలుషితమయిన నీరు వాటర్ బాటిల్స్‌లో అందించే వారిని జైల్లో వేస్తాం! అదిగాక లక్షల రూపాయల ఫైన్ వేస్తాం’ అంటూ వాళ్ల మీద విరుచుకు పడాలి. ఆ దుర్మార్గానికి పాల్పడేవాళ్లను బెదిరించాలి. లోపట వేయాలి.
ఇక మన నగర పోలీస్ కమిషనర్ దీపావళి సందర్భంగా వార్నింగిస్తాడు.
‘రాత్రి పది దాటాక ఎవరయినా క్రాకర్స్ పేలుస్తే చట్టరీత్యా శిక్షార్హులు’ అంటూ భలే స్టేట్‌మెంటిస్తాడు.
మొత్తం దేశమంతా రాత్రి తెల్లార్లూ అతి భయంకరమైన శబ్దాలతో దీపావళి బాంబులు మోత్తెక్కించేస్తారు. కానీ అవేమీ పోలీస్‌లకి కనిపించవ్. వినిపించవ్.
ఇక న్యూఇయర్ నాడు సరేసరి.
‘నూతన సంవత్సరం సందర్భంగా రోడ్ల మీద న్యూసెన్స్ చేయకూడదు. మందుకొట్టి డ్రైవింగ్ చేయకూడదు’ అంటూ వార్నింగ్ ఇస్తాడో పోలీస్ అధికారి.
రాత్రంతా రోడ్ల మీద ఎంత న్యూసెన్స్ జరుగుతుందో అందరికీ తెల్సిందే.
‘ఓ భారత స్ర్తిలారా! మీరిళ్లల్లో నుంచి బయటకు రాకండి. మంగళసూత్రం దొంగలున్నారు’ అంటూ పోలీసు వాళ్ల ప్రచారం మనకి వీధివీధికీ కనపడుతుంది. కానీ ‘స్ర్తిలారా! మీరు నిర్భయంగా వీధుల్లో మంగళసూత్రాలూ, నగలతో సంచరించండి. మా పోలీస్ డిపార్ట్‌మెంట్ దొంగల పని పడుతుంది’ అనే ప్రచారం ఎక్కడా కనిపించదు.
ఇంతకంటే మనకింకే సర్కస్ వినోదం కావాలి?

No comments:
Post a Comment