బొంగులో వార్త:
బొత్స ఓ బచ్చా .. వెయ్యిమందిని చూశా : చంద్రబాబు
తన ముందు బొత్స సత్యనారాయణ ఓ బచ్చా అని.. ఇలాంటి వారిని తన రాజకీయ జీవితంలో వెయ్యిమందిని చూశానని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. మద్యం సిండికేట్ల భరతం పడుతామన్నారు.
మద్యం సిండికేట్లపై విజయనగరంలో టీడీపీ ఆధ్వర్యంలో జరిగే ధర్నాలో పాల్గొనేందుకు ఆయన సోమవారం విశాఖ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ... తన రాజకీయ జీవితంలో బొత్సలాంటి వ్యక్తుల్ని వెయ్యిమందిని చూశానన్నారు.
కాంగ్రెస్ ఎన్ని అడ్డంకులు సృష్టించినా లిక్కర్ సిండికేట్ల భరతం పట్టి తీరుతామని ఆయన శపథం చేశారు. కిరణ్ కుమార్ రెడ్డి పనికిమాలిన సీఎం అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయనగరం జిల్లా ఎస్పీ కాంగ్రెస్ పార్టీకి, బొత్స సత్యనారాయణకు తొత్తుగా మారారని ఆరోపించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారుల చేత తప్పుడు పనులు చేయిస్తోందని ఆయన అన్నారు. ప్రజల కోసం ప్రజాస్వామ్య బద్ధంగా ధర్నాచేస్తుంటే అడ్డుకోవటం నీచమని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.
బొత్స ఓ బచ్చా .. వెయ్యిమందిని చూశా : చంద్రబాబు
తన ముందు బొత్స సత్యనారాయణ ఓ బచ్చా అని.. ఇలాంటి వారిని తన రాజకీయ జీవితంలో వెయ్యిమందిని చూశానని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. మద్యం సిండికేట్ల భరతం పడుతామన్నారు. మద్యం సిండికేట్లపై విజయనగరంలో టీడీపీ ఆధ్వర్యంలో జరిగే ధర్నాలో పాల్గొనేందుకు ఆయన సోమవారం విశాఖ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ... తన రాజకీయ జీవితంలో బొత్సలాంటి వ్యక్తుల్ని వెయ్యిమందిని చూశానన్నారు.
కాంగ్రెస్ ఎన్ని అడ్డంకులు సృష్టించినా లిక్కర్ సిండికేట్ల భరతం పట్టి తీరుతామని ఆయన శపథం చేశారు. కిరణ్ కుమార్ రెడ్డి పనికిమాలిన సీఎం అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయనగరం జిల్లా ఎస్పీ కాంగ్రెస్ పార్టీకి, బొత్స సత్యనారాయణకు తొత్తుగా మారారని ఆరోపించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారుల చేత తప్పుడు పనులు చేయిస్తోందని ఆయన అన్నారు. ప్రజల కోసం ప్రజాస్వామ్య బద్ధంగా ధర్నాచేస్తుంటే అడ్డుకోవటం నీచమని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.
No comments:
Post a Comment