PLEASE FEEL FREE TO CLICK ON THE ADS! --- దయ చేసి భయపడకుండా ప్రకటనల మీద క్లిక్ చేయగలరు

Wednesday, April 4, 2012

లిక్కర్‌ సిండి'కేటు' బాలరాజు ని అదుపులోకి తీసుకున్న ఎసిబి

బొంగులో వార్త:
మూడు నెలలుగా పరారీలో వున్న మద్యం సిండికేట్‌ బాలరాజు గౌడ్‌ను ఎసిబి అధికారులు ఎట్టకేలకు పట్టుకు న్నారు. సోమవారం అర్థరాత్రి తిరు పతికి సమీపంలోని రేణిగుంట వద్ద ఓ రహస్య ప్రాంతంలో అతన్ని ఎసిబి ప్రత్యేక బృందం అదుపులోకి తీసుకుంది. అనంతరం అతన్ని అక్కడే విచారించి కొంత సమాచా రాన్ని రాబట్టింది. అతన్ని మంగళ వారం అర్థరాత్రి ప్రాంతంలో హైదరా బాద్‌కు తరలించే అవకాశం వుంది. బుధవారం ఉదయం అతన్ని ఎసిబి కోర్టులో హాజరుపరిచే వీలుంది. హైదరాబాద్‌, రంగారెడ్డి, మహబూబ్‌ నగర్‌, మెదక్‌ జిల్లాలలో లిక్కర్‌ సిండికేట్ల లావాదేవీలన్నీ బాలరాజు గౌడ్‌కు తెలుసునని ఎసిబి అధి కారులు విశ్వసిస్తున్నారు. రాష్ట్రంలోని బడా మద్యం సిండికేట్‌ నాయకుల్లో బాలరాజు గౌడ్‌ ఒకడని ఎసిబి భావిస్తోంది. ఖమ్మం జిల్లాకు చెందిన నున్న రమణ తరువాత బాలరాజు గౌడ్‌దే మద్యం సిండికేట్ల లావా దేవీల్లో ముఖ్యపాత్రగా ఎసిబి అధికారులు విశ్వసిస్తున్నారు. హైదరాబాద్‌, రంగారెడ్డి, మహబూబ్‌ నగర్‌, మెదక్‌ జిల్లాలలో లిక్కర్‌ సిండికేట్ల లావాదేవీలపై ఎసిబి విచారణ మూడు నెలలుగా ఆగిపోయింది. బాలరాజు గౌడ్‌ అరెస్టుతో ఈ విచారణ ఊపందు కుంది. బాలరాజును బుధవారం ఉదయం ఎసిబి కోర్టులో హాజరు పరచిన తరువాత అతన్ని తమ కస్టడీకి ఇవ్వాలని ఎసిబి కోరే వీలుంది. మరోవైపు బాలరాజు గౌడ్‌ను సిబిఐ అధికారులు కూడా విచారించేందుకు సిద్ధమవుతున్నారు. అబిడ్స్‌లోని కెనరా బ్యాంకును అతను 200 కోట్ల రూపాయల వరకు మోసం చేశాడు. తప్పుడు పత్రాలతో కెనరా బ్యాంకుకు బాలరాజు గౌడ్‌ టోకరా వేశాడు. దీనిపై సిబిఐ విచారిస్తోంది.

No comments:

Popular Posts

Desclaimer: Please note this Blog is only video embeddeding Blog. all of the news articles, videos and photos found here come from 3rd party video and news hosting sites. We do not host any of the videos and news articles. Please contact us through mail for any copyright issues.