PLEASE FEEL FREE TO CLICK ON THE ADS! --- దయ చేసి భయపడకుండా ప్రకటనల మీద క్లిక్ చేయగలరు

Wednesday, April 4, 2012

మొదటి రోజు ఐ పి ఎల్ లో భజ్జీ వర్సెస్ ధోని

బొంగులో వార్త:

చెన్నై: దాదాపు రెండు నెలలపాటు జరిగే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఐదో సీజన్ మ్యాచ్‌లకు నేడు తెర లేవనుంది. వరుసగా రెండు టైటిళ్లు నెగ్గి హ్యాట్రిక్ మీద కన్నేసిన చెన్నై సూపర్ కింగ్స్... ఈసారి ఎలాగైనా చాంపియన్‌గా నిలవాలనే పట్టుదలతో ఉన్న ముంబై ఇండియన్స్ జట్లు బుధవారం జరిగే ప్రారంభ మ్యాచ్‌లో తలపడనున్నాయి. స్థానిక ఎం.చిదంబరం మైదానంలో జరిగే ఈ మ్యాచ్ రాత్రి ఎనిమిది గంటలకు ప్రారంభమవుతుంది. టోర్నీలో అత్యంత పటిష్టంగా కనిపిస్తున్న ఈ రెండు జట్ల మధ్య సమరం అభిమానులను అలరిస్తుందనడంలో సందేహం లేదు.

మరోవైపు ముంబై జట్టులో కెప్టెన్సీ మార్పు జరిగింది. సచిన్ జట్టు బాధ్యతల నుంచి తప్పుకోవడంతో కొత్త సారథిగా హర్భజన్ సింగ్ వ్యవహరించనున్నాడు. గతేడాది చాంపియన్స్ లీగ్‌లో సచిన్ గైర్హాజరీ కారణంగా భజ్జీ నాయకత్వం వహించి ఏకంగా టైటిల్‌ను అందించాడు. అదే ఊపుతో ఇప్పటిదాకా అందకుండా ఊరిస్తున్న ఐపీఎల్‌ను చేజిక్కించుకోవాలనే కసితో ముంబై ఉంది.

అలాగే సొంత అభిమానుల అండతో తొలి మ్యాచ్‌ను విజయవంతంగా పూర్తి చేయాలనే ఆలోచనతో చెన్నై ఉంది. ఇరుజట్లకు అద్భుతమైన ఆల్‌రౌండర్లు ఉండడంతో గెలుపు కోసం హోరాహోరీ తప్పదు. ఈ టోర్నీలో ధోని సేనకు ఘన చరిత్రే ఉంది. తొలిసారి ఫైనల్‌కు చేరుకోగా రెండోసారి సెమీస్, మూడు, నాలుగో సీజన్లలో విజేతగా నిలిచింది. ముంబై జట్టు మూడో సీజన్‌లో ఫైనల్‌కు చేరగా గతేడాది రెండో క్వాలిఫై ఫైనల్లో ఓడింది.

కొత్త కెప్టెన్‌తో ముంబై జోష్

ఈసారి సరికొత్త హంగులతో ముంబై ఇండియన్స్ బరిలోకి దిగనుంది. కొత్త కెప్టెన్‌తో పాటు జట్టులో మరికొందరు నూతన ఆటగాళ్లు చేరారు. దీంతో ప్రత్యర్థులకు గట్టి పోటీనిచ్చేందుకు సిద్ధమవుతోంది. ఇతర జట్ల నుంచి వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్, ప్రజ్ఞాన్ ఓజాలను జట్టులోకి తీసుకున్నారు. ఇటీవలి వేలంలో గిబ్స్, మిచెల్ జాన్సన్, రాబిన్ పీటర్సన్, ఆర్పీ సింగ్, పెరీరాలను కొనుగోలు చేసుకున్నారు. అలాగే దక్షిణాఫ్రికా టి20 సంచలనం రిచర్డ్ లెవీ కూడా జట్టుకు బలమే. ఇక ఆల్‌టైమ్ గ్రేట్ సచిన్‌తో పాటు రోహిత్, పొలార్డ్ విజృంభిస్తే ముంబైకు పండగే.

చెన్నై బ్యాటింగ్ పటిష్టం

కెప్టెన్ ధోని హిట్టింగ్‌కు తోడు సురేశ్ రైనా, బద్రీనాథ్, మురళీ విజయ్, ఆల్‌రౌండర్లు రవీంద్ర జడేజా, ఆల్బీ మోర్కెల్, డ్వేన్ బ్రేవోలతో బ్యాటింగ్ విభాగం పటిష్టంగా కనిపిస్తోంది. ఫామ్‌లో ఉన్న ఓపెనర్ మైక్ హస్సీ, పేసర్ హిల్ఫెన్హాస్ ఈనెలాఖరు వరకు అందుబాటులో ఉండరు. ప్రస్తుతం వీరు వెస్టిండీస్ పర్యటనలో జట్టుతోపాటే ఉన్నాడు. బొలింజర్, మోర్కెల్ పేస్ బాధ్యతలను తీసుకోనున్నారు.




No comments:

Popular Posts

Desclaimer: Please note this Blog is only video embeddeding Blog. all of the news articles, videos and photos found here come from 3rd party video and news hosting sites. We do not host any of the videos and news articles. Please contact us through mail for any copyright issues.