PLEASE FEEL FREE TO CLICK ON THE ADS! --- దయ చేసి భయపడకుండా ప్రకటనల మీద క్లిక్ చేయగలరు

Wednesday, April 11, 2012

కన్ఫ్యుసన్ లో ఎక్కువ కన్ఫ్యూస్ చేస్తున్న తారా చౌదరి

బొంగులో వార్త:

వ్యభిచారం కేసులో అరెస్టయిన వర్ధమాన నటి తారా చౌదరి గడియకో మాట మారుస్తున్నట్లు చెబుతున్నారు. పోలీసులు ఆమెను తమ కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు. అయితే, ఆమె పోలీసుల విచారణకు ఏ మాత్రం సహకరించడం లేదని వార్తలు వస్తున్నాయి. పొంతనలేని కథనాలు చెబుతూ పోలీసులను తికమక పెడుతున్నట్లు తెలుస్తోంది. తాను అమాయకురాలినని, తనకు ఏమీ తెలియదని చెబుతూ కాలం గడిపే ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.

మూడో రోజు మంగళవారం కూడా ఆమెను పోలీసులు విచారించారు. కానీ ఆమె నుంచి సమాచారం పెద్దగా రాబట్టలేకపోయారని అంటున్నారు. ఓ పారిశ్రామికవేత్త హత్యకు ఆమె సుపారీ ఇచ్చినట్లు వార్తలు రావడంతో వాటిని ధ్రువీకరించుకునేందుకు పోలీసులు ప్రయత్నించారు. కానీ ఆమె సరైన సమాధానం ఇవ్వలేదు. తనను చంపేందుకు ఎవరో సుపారీ ఇచ్చారని, తనకు భయమేస్తోందని ఆమె చెప్పిందని అంటున్నారు.

ఎవరినీ చంపే ఉద్దేశం తనకు లేదని తారా చౌదరి చెప్పిందని అంటున్నారు. అయితే, ఓ వ్యక్తిని చంపేందుకు ఐదుల లక్షల రూపాయల సుపారీ ఇచ్చినట్లు అంగీకరించిదట. కేవలం ఈ విషయాన్ని నిర్ధారించుకునేందుకే పోలీసులకు దాదాపు రెండు గంటల సమయం పట్టినట్లు వార్తలు వచ్చాయి. కర్నూలు జిల్లాకు చెందిన పారిశ్రామికవేత్త నర్సింహులును తారా చౌదరి బ్లాక్ మెయిల్ చేసినట్లు వార్తలు వచ్చాయి.

చంపేస్తానని బెదిరించడమే కాకుండా పడుపు వృత్తి వ్యవహారాలను పోలీసులకు చెబుతానని అతను హెచ్చరించాడని అంటున్నారు. దాంతో అతన్ని చంపేందుకు తారా చౌదరి ఐదు లక్షల రూపాయల సుపారీ ఇచ్చినట్లు తెలుస్తోంది. అదే రంకగా రాయలసీమకు చెందిన ఓ పార్లమెంటు సభ్యుడి కుమారుడిని కూడా ఆమె బెదిరించిందని అంటున్నారు. అయితే, పార్టీ నాయకులకు తానే పార్టీ ఫండ్ ఇచ్చేదాన్నని ఆమె చెప్పినట్లు తెలుస్తోంది.

తారా చౌదరి నివాసంలో పోలీసులు మంగళవారం సోదాలు నిర్వహించారు. వారికి ఆమె ఇంట్లో బస్తా మద్యం సీసాలు, కొన్ని విలువైన పత్రాలు, సిడీలు, కంప్యూటర్ హార్డ్ డిస్క్‌లు స్వాధీనం చేసుకున్నారు. అవి ఎక్కడివని అడిగితే తన భర్త ప్రసాద్‌తో కలిసి తాను రోజూ తాగేదాన్నని ఆమె చెప్పిందని అంటున్నారు. సిబిఐతో దర్యాప్తు జరిపించాలని తారా చౌదరి డిమాండ్ చేస్తోంది.

No comments:

Popular Posts

Desclaimer: Please note this Blog is only video embeddeding Blog. all of the news articles, videos and photos found here come from 3rd party video and news hosting sites. We do not host any of the videos and news articles. Please contact us through mail for any copyright issues.