బొంగులో వార్త:
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి స్త్రీనిధి పథకాన్ని ప్రారంభించారు. బ్యాంకుల నుంచి ఎటువంటి పూచీకత్తు లేకుండా రూ. 11, 500 కోట్ల రుణాలను వడ్డీ లేకుండా ఈ పథకం ద్వారా రుణాలను అందజేయనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలోని మహిళలను లక్షాధికారుల్ని చేసి, వారు ఆర్థికంగా ఎదగాలన్నదే తమ ప్రభుత్వం ధ్యేయమన్నారు. మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకుంటే కుటుంబం మరింత అభివృద్ధి పథంలో దూసుకు వెళుతుందన్నారు.
ఆర్టీసీ కళాభవన్‌లో ఏర్పాటు చేసిన సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ... స్త్రీనిధి పథకం కింద మహిళలు వడ్డీ లేని రుణాలను పొందవచ్చునన్నారు. ఇంతటి భరోసా కల్పించింది మహిళా గ్రూపులేననీ, తీసుకున్న డబ్బును సక్రమంగా తిరిగి చెల్లించడం వల్లనే ఇది సాధ్యమవుతోందని అన్నారు.
మహిళలకు ఇస్తున్న రుణాలపై 14 శాతం వడ్డీని పూర్తిగా ప్రభుత్వమే భరిస్తూ ఈ రుణాలను బ్యాంకుల ద్వారా ఇప్పించేందుకు ఏర్పాటు చేసిందన్నారు. పావలా వడ్డీ రుణాలను ఎంతో జాగ్రత్తగా కడుతూ వచ్చిన మహిళా గ్రూపులు వడ్డీలేని రుణాలను కూడా అంతే జాగ్రత్తగా కట్టుకుంటూ లక్షాధికారులు కావాలని అన్నారు.
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి స్త్రీనిధి పథకాన్ని ప్రారంభించారు. బ్యాంకుల నుంచి ఎటువంటి పూచీకత్తు లేకుండా రూ. 11, 500 కోట్ల రుణాలను వడ్డీ లేకుండా ఈ పథకం ద్వారా రుణాలను అందజేయనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలోని మహిళలను లక్షాధికారుల్ని చేసి, వారు ఆర్థికంగా ఎదగాలన్నదే తమ ప్రభుత్వం ధ్యేయమన్నారు. మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకుంటే కుటుంబం మరింత అభివృద్ధి పథంలో దూసుకు వెళుతుందన్నారు. ఆర్టీసీ కళాభవన్‌లో ఏర్పాటు చేసిన సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ... స్త్రీనిధి పథకం కింద మహిళలు వడ్డీ లేని రుణాలను పొందవచ్చునన్నారు. ఇంతటి భరోసా కల్పించింది మహిళా గ్రూపులేననీ, తీసుకున్న డబ్బును సక్రమంగా తిరిగి చెల్లించడం వల్లనే ఇది సాధ్యమవుతోందని అన్నారు.
మహిళలకు ఇస్తున్న రుణాలపై 14 శాతం వడ్డీని పూర్తిగా ప్రభుత్వమే భరిస్తూ ఈ రుణాలను బ్యాంకుల ద్వారా ఇప్పించేందుకు ఏర్పాటు చేసిందన్నారు. పావలా వడ్డీ రుణాలను ఎంతో జాగ్రత్తగా కడుతూ వచ్చిన మహిళా గ్రూపులు వడ్డీలేని రుణాలను కూడా అంతే జాగ్రత్తగా కట్టుకుంటూ లక్షాధికారులు కావాలని అన్నారు.
No comments:
Post a Comment