బొంగులో వార్త:
ఇండోనేషియను మళ్లీ భూకంపం తాకింది. ఈ నెల 11వ తేదీన ఇండోనేషియాలోని సుమత్రాలో భారీ భూకంపం వచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుత భూకంపం రెక్టర్ స్కేలుపై 6.6గా నమోదైనట్లు అమెరికా జియోలాజకిల్ సర్వే తెలిపింది. సునామీ హెచ్చరికలు జారీ చేయలేదు. ఈ భూకంపం శనివారం ఉదయం 54 గంటల 14 నిమిషాల ప్రాంతంలో వచ్చింది. సుమత్రాలోని ఉత్తర దిశలో ఈ భూకంప కేంద్రం నమోదైంది.
భూకంపం వచ్చిన బందా పాపువా ప్రాంతంలో భూకంపాలు తరుచూ వస్తుంటాయి. ఇండోనేషియా రింగ్ ఆఫ్ పైర్‌లో ఉంది. పసిఫిక్ సముద్రంలో సంభవించే మార్పుల వల్ల భూకంపాలు వస్తుంటాయి. డిసెంబర్ 2004లో సుమత్రాలో భారీ భూకంపం వచ్చింది. అది రెక్టర్ స్కేలుపై 9.1గా నమోదైంది. దాంతో సునామీ వచ్చింది. ఇందులో 2 లక్షల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు.
భూకంపం వల్ల మనోక్వారీలో ఏ విధమైన నష్టం వాటిల్లలేదని, అయితే, దానికి 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న రాన్సికిలో మాత్రం భారీ నష్టం వాటిల్లిందని అంటున్నారు. కొన్ని భవంతులు కూలిపోయాయని, చెట్లు విరిగిపడిపోయాయని అధికార వర్గాలు చెబుతున్నాయి.
పశ్చిమ పాపువాలోని ప్రజలు భూకంపానికి భయాందోళనలకు గురై ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. భూకంపం 10 కిలోమీటర్ల లోతులో చోటు చేసుకున్నట్లు చెబుతున్నారు. భవంతులు భూకంప తీవ్రతకు వణికిపోయాయి.

No comments:
Post a Comment