బొంగులో వార్త:
గుంటూరు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. భార్య భర్తపై యాసిడ్ దాడి చేసిన సంఘటన చోటు చేసుకుంది. గుంటూరు జిల్లా ఈపూరు మండలం ఓడిచెర్ల గ్రామంలో యేసురత్నం అనే వ్యక్తిపై అతని భార్య యేసమ్మ రాత్రి పూట యాసిడ్ పోసి హత్యకు ప్రయత్నించింది. వారిద్దరికి ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. ఈ ఘటనలో యేసురత్నం తీవ్రంగా గాయపడ్డాడు. అతను ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. పోలీసులు కేసున నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
యేసమ్మకు గ్రామంలోని ఓ వ్యక్తితో అక్రమ సంబంధం ఉందని ఆమె భర్త యేసురత్న చెబుతున్నాడు. యేసురత్నం చెప్పిన వివరాల ప్రకారం - యేసమ్మకు అక్రమ సంబంధం పెట్టుకున్న వ్యక్తి సెల్ ఫోన్ కొనిచ్చాడు. దాంతో ఇద్దరూ మాట్లాడుకుని తరుచూ కలుస్తుండేవారు. ఈ అక్రమ సంబంధంపై భర్త యేసురత్నం ఆమెను హెచ్చరించాడు. అయినా వినకపోగా భర్తపై దాడి చేసింది.
భర్తను వదిలించుకోవాలని యేసమ్మ తీవ్రంగానే ప్రయత్నించినట్లు స్థానికులు చెబుతున్నారు. గతంలో కూడా యేసురత్నంపై
ఆమె దాడి చేసిందని అంటున్నారు. ఇంతకు ముందు యేసమ్మ యేసురత్నం కంట్లో కారం కూడా కొట్టిందని వారంటున్నారు. భార్య దాడిలో యేసురత్న ముఖం కాలిపోయింది. అతను దినసరి కూలీ. తనను చంపాలని భార్య ప్రయత్నిస్తోందని యేసురత్నం ఆరోపిస్తున్నాడు. గతంలో తన శరీరంపై వాతలు పెట్టిందని కూడా అంటున్నాడు.
ఇదిలా పుంటే, రంగా రెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం చెరువు వద్ద ఓ గుర్తు తెలియని మహిళ దారుణ హత్యకు గురైంది. అక్కడ ఓ పాప కూడా ఉంది. పాప ఏడ్పును విని గ్రామస్తులు అక్కడికి వెళ్లి చూసేసరికి మహిళ హత్యకు గురై కనిపించింది. పోలీసులకు సమాచారాన్ని అందించారు. పోలీసులు వచ్చి శవాన్ని స్వాధీనం చేసుకున్నారు. మహిళ ఎవరనే విషయాన్ని గుర్తించడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు. మహిళను హత్య చేసిన దుండగులు పాపను మాత్రం వదిలేసి వెళ్లారు.

No comments:
Post a Comment