PLEASE FEEL FREE TO CLICK ON THE ADS! --- దయ చేసి భయపడకుండా ప్రకటనల మీద క్లిక్ చేయగలరు

Thursday, April 5, 2012

ఎన్టీఆర్ ఆశయ సాధన కోసమే రాజకీయాల్లోకి : బాలయ్య

బొంగులో వార్త: గురువారం, 5 ఏప్రిల్ 2012: తన తండ్రి స్వర్గీయ ఎన్టీ రామారావు ఆశయాల సాధన కోసమే తాను రాజకీయాల్లోకి వస్తున్నట్టు సినీ నటుడు, టీడీపీ నేత బాలకృష్ణ చెప్పారు. ప్రస్తుతం బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి విస్తరణ, నిధుల సేకరణలో భాగంగా ఆయన అమెరికాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా లండన్‌లో ఆయన ఎన్నారై టీడీపీ కార్యకర్తలతో సమావేశమయ్యారు. తన తండ్రి ఎన్టీఆర్ ఆశయాలను నెరవేర్చేందుకు రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషిస్తానని చెప్పారు. టీడీపీ భవిష్యత్ అంతా యువతదే కీలక పాత్ర కానుందన్నారు. అందువల్ల రాజకీయాల్లోకి వచ్చి అవినీతిని అక్రమాలలకు అడ్డుకట్ట వేయాలని ఆయన పిలుపునిచ్చారు. పార్టీ అనుసరించిన విధానాల మూలంగా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన లక్షల మంది యువకులకు విదేశాల్లో ఉపాధి లభించిందన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తాను పోటీ చేస్తానన్నారు. అయితే పోటీ చేసే స్థానం మాత్రం తనకు లేదని, పోటీ చేసే స్థానాన్ని పార్టీ అధిష్టానం ఖరారు చేస్తుందన్నారు. రాష్ట్ర ప్రజలకు సుపరిపాలన అందించేందుకు కృషి చేస్తానని చెప్పారు. అందుకోసం శక్తివంచన లేకుండా కృషి చేస్తానని బాలకృష్ణ హామీ ఇచ్చారు.

No comments:

Popular Posts

Desclaimer: Please note this Blog is only video embeddeding Blog. all of the news articles, videos and photos found here come from 3rd party video and news hosting sites. We do not host any of the videos and news articles. Please contact us through mail for any copyright issues.