మెగాస్టార్‌ఫ్యాన్స్ అభిమానులు ఒక ట్రెండ్‌లో పోతుంటారు. వారు ఆశించినట్లు ఈ చిత్రం వుంటుందని చిరంజీవి రచ్చ ఆడియోలో వెల్లడించారు. వారి కోసమే కథను తయారుచేసుకున్న సంపత్‌నంది దర్శకుడు పరు చూరి బ్రదర్స్ సంభాషణల బ్రాండ్‌తో మణిశర్మ బాణీల తో ఎలా డీల్ చేశాడో చూడా లంటే.. సినిమాలోకి వెళ్లా ల్సిందే. కథ: సినిమా ఆరంభంలోనే సినిమా ఏమిటో తేలిపోయే సన్నివేశంతో స్టార్ట్ అవుతుంది. ఓగ్రామంలో గ్రామ పెద్ద రఘుపతి (నాజర్), అతని స్నేహితుడు సూర్యనారాయణ (పార్తీపన్) ఇద్దరూ తమకున్న 3వేల ఎకరాల పొలాన్ని రైతు కూలీలకు ఇచ్చి వారిని రైతులు మార్చాలనుకుని మంచి రోజు చూసి పూజ చేస్తారు. పూజలో తెల్లకలువపూలు తేలేదని రాజ్ ఇంటికి వెళతాడు. తిరిగివచ్చేసరికి అక్కడ మరుభూమిని తలపిస్తుంది. బాంబ్‌బ్లాస్ట్‌తో అందరూచనిపోతారు.
ఆ తర్వాత కథ ఇప్పటికి మారుతుంది. జేమ్స్ (ఆజ్మల్) ఓ డేంజర్ గేమ్ ఆడతాడు. దాని ప్రకారం రైలు ఎదురుగా రెండు కార్లలోవెళ్లి చివరి నిమిషంలో తప్పించుకోవాలి. వీకెండ్‌పార్టీలో తన స్నేహితులతో బెట్టింగ్ కడుతుండగా. వేణుమాధవ్ తన స్నేహితులతో వచ్చి. బస్తీరాజ్ వున్నాడంటూ.. ముందుకువస్తాడు. వెంటనే హీరో రాజ్ (రామ్‌చరణ్) ప్రత్యక్షమై.. ఆ బెట్టింగ్‌లో గెలుస్తాడు. ఇది జీర్ణించుకోలేక మళ్లీ అతనితోనే మరో బెట్టింగ్‌కడతాడు... పెంచిన తండ్రి ఎంఎస్. నారాయణ చావుబతులో వుంటాడు. ఆపరేషన్‌కు 20లక్షలు కావాలి. అందుకే ఆ విషయం తెలిసి రాజ్‌తో జేమ్స్ ఓ పందెం వేస్తారు. బళ్లారి అనే ఫేమస్ వ్యక్తి కూతురు చైత్ర (తమన్నా) చేత ఐలవ్‌యు అని చెప్పించాలి. దీనికి రాజ్ ఓకే అన్నాడు. అలా ఆ అమ్మాయి ప్రేమకోసం రకరకాలప్రయత్నాలుచేస్తాడు. ఆమె చుట్టూ ఎప్పుడూ రక్షణవలయంగా బాడీగార్డ్‌లు వుంటారు. చైత్ర తనను ప్రేమించాలంటే మూడు పరీక్షలు పెడుతుంది. ఆ మూడింటినీ తన తెలివితేటలతో గెలుస్తాడు రాజ్. చివరికి ఐలవ్‌యు అనేచెప్పే టైమ్‌లో చైత్ర నాన్నకు విషయం తెలిసి రాజ్‌ను చంపడానికి ట్రై చేస్తాడు. ఆ తర్వాత వారిద్దరూ తప్పించుకుని శ్రీశైలం అడవులకు పారిపోతారు. ఈ విషయం తెలసి పొలిటికల్ లీడర్ బైరెడ్డి (కోట) కొడుకు దేవ్‌గిల్ విదేశాల నుంచి వస్తాడు. అతనితో చైత్ర తండ్రి ఆమెను చంపేయాలని చెబుతాడు. తండ్రే అలా ఎందుకు చెప్పాడు. అందులో ట్విస్ట్ ఏమిటి? ఆ తర్వాత కథ ఏమిటి? అనేది సినిమా. ఈ చిత్ర కథంతా నాలుగైదు సినిమాలు చూసిన ఫీలింగ్ కలుగుతుంది. భూముల పంపకం కథనుంచి ఎత్తుకుంటే... బన్నీ కథ గుర్తుకువస్తుంది. సెకండాఫ్‌లో హీరోయిన్‌ను ఎత్తికెళ్లే ఎపిసోడ్ చిరుతను తలపిస్తుంది. తమన్నా తండ్రి కూతురు పెంచే విధానం... వైవిఎస్ చౌదరి 'దేవదాస్'కు మక్కికిమక్కీ హీరోయిన్‌ను లవ్‌ట్రాక్‌లో పడేసే సీన్ శంకర్‌దాబా ఎంబి బిఎస్, 'ఇలా లెఫ్ట్ అలా రైట్ ఇచ్చుకో.. హీరోయిన్‌ను హీరో అనే సీనంతా గ్యాంగ్ లీడర్‌ను తలప ిస్తుంది. వానావానా పాట... చెప్పన వసరంలేదు. ఇదికా కుండా ఓట మంటే తెలీదు. గెలుపు మా జీన్స్ అంటూ. వాడే డైలాగ్‌లు చేసే చేష్టలు 'కిక్' సినిమాను గుర్తుకు చేస్తాయి. మొదట్లోనే బెట్టింగ్ కట్టి డెడ్‌గేమ్ ఆడే సీన్ 'మగధీర' కాన్పెప్ట్... ఇన్ని సినిమాలు ఒక్క టికెట్‌పై చూసే ఫీలింగ్ ప్రేక్షకుడికి కలుగుతుంది. రామ్‌చరణ్ పాత్రపరంగా బాగానే చేశాడు. ఎక్కువగా తన తండ్రిని అనుకరించాడ నేచెప్పాలి. మాడ్యులేషన్, హావభావాలు అన్నీ అలానే వుంటాయి. తమన్నా బ్యూటీని మరోసారి ఈ చిత్రంలో చూడొచ్చు. ఇతర పాత్రాలు పాత్ర మేరకు పండాయి. అలీ, ధర్మవరపు, కోట, దేవ్‌గిల్, సన, ఎంఎస్.నారాయణ సాధారణంగా వున్నాయి. బేసిక్‌గా సంపత్‌నంది ఓల్డ్ ఫార్మెట్‌లో వెళ్లాడు. కథ పాతదేచెప్పే విధానం కొత్తగా వుండాలి. అది ఇందులో లోపించింది. ఎక్కడ స్క్రీన్‌ప్లే ఇంట్రస్ట్‌గా అనిపించలేదు.
పరుచూరిబ్రదర్స్ తన సంభాషణలు మాస్ చిత్రాల కోవలో బాలయ్యకు, ఎన్.టి.ఆర్.కు రాసినట్లుగా రాశారు. మాట్లాడితే.. రాజ్... బస్తీరాజ్.. అంటూ... హీరోచేత పలికిండచం.. బాడ్.. జేమ్స్‌బాండ్... అన్న డైలాగ్‌లోంచి పుట్టించారు. ఇలా ఏదీ కొత్తదనం కన్పించదు. ఇకసంగీతపరంగా మణిశర్మ కొత్తబాణీలు చూపించలేదు. వానవాన పాట... చిరంజీవి చిత్రంలోని బెటర్ అనిపంచేలా వుంది.
ఇందులో ఏ కొత్తదనంలేదు. రామ్‌చరణ్ మగధీర తర్వాత అంతటి రేంజిలో ఆవేశం, కోపతాపాలు పెర్‌ఫార్మెన్స్ చూపించే కథదొరకలేదేనేచెప్పాలి. దర్శకుడు క్లైమాక్స్‌లో మగధీర తరహాలో షేర్‌ఖాన్ ఒక్కరుకాదు వందమందివచ్చినాపర్లేదు.. అన్నట్లుగా.... తనకు దొరికిన కత్తితో విలన్ గ్యాంగ్‌లను ఎడాపెడా... వందమందిని లేపేస్తాడు. ఇలా మాస్‌ను ఎట్రాక్ట్‌చేసే అంశాలతో కథాబలం లేకండా చేసిన ప్రయత్నమే ఈ సినిమా. మొదటి భాగం చాలా సాదాసీదాగా సాగింది. అనుకోని ట్విస్ట్‌లు కూడా లేకుండాపోయాయి. ఎక్కువగా కుత్తుకలు కోయడం, కాల్చడం వంటి యాక్షన్‌సీన్సే చిత్రంలో ఎక్కువగా కన్పిస్తాయి. ఫ్యాన్స్ కోసం, మాస్ ఆడియన్స్ కోసమే సినిమా తీశామని ముందు నుంచి చెబుతున్న నిర్మాతలు, దర్శకుడు చేసిన ప్రయత్నం.. ఇంకెవరూ చూడరనీ వారే డిసైడ్ అయ్యాక.... మనం చెప్పేది కూడా ఏమీలేదని సినిమా చూశాక అర్థమవుతుంది.
No comments:
Post a Comment