బొంగులో పోస్ట్:
మందుకి ‘మందు’ అన్న పేరెందుకొచ్చింది?
ఎందుకంటే ‘మందే సర్వరోగ నివారిణి’ అనే విషయం మన మందూభాయ్ దేశాయ్‌లు ఎన్నో ఎక్స్‌పెరిమెంట్స్ చేసి కనుక్కున్నారు.
వాళ్ల ఉద్దేశం ఏమిటంటే మందు శరీరంలోని రోగాలకే కాదు - మానసిక రోగాలక్కూడా అద్భుతంగా పనిచేస్తుందని! అందుకే రోజు రోజుకీ మందు కొట్టటం అనే ఒక ‘సంస్కారం’ అనే పరిస్థితి వచ్చేస్తోంది.
ఏదేమయినా ఈ మందేమాతరమ్ కేటగిరీ వాళ్లు - ఆ మందు అలవాటు నుంచీ బయటపడటం మాత్రం ఇంపాజిబుల్.
వాళ్ల కండిషన్ ఎంత సీరియస్‌గా ఉన్నా సరే - ఇంకో పెగ్ కొట్టావంటే ఛస్తావ్ అని డాక్టర్ వార్నింగిచ్చినా సరే - వాళ్లు లెక్కచేయరు. మందు లేనప్పుడు బ్రతికినా ఒకటే చచ్చినా ఒకటే అని ఫీలవుతారు. ఇక వాళ్లు మందు కొట్టాక చేసే విన్యాసాలు మరీ కామెడీగా ఉంటాయ్.
ఒకడు మందెక్కువయిందంటే తన క్లోజ్‌ఫ్రెండ్స్‌కి సెల్ కొడతాడు.
‘హలో’
‘హలో అన్నా - నేనన్నా షీశాంష్‌ని’
‘షీశాంషా? షీ శాంష్ ఎవరు?’
‘నేనే భయ్ - షీశాంష్ - షీ శాంష్’
అప్పుడర్థమయిందతనికి.
‘ఓర్నీ - శ్రీకాంతా- ఏంటి? ఇంత రాత్రప్పుడు చేశావ్?’
‘అదేన్నా నీకు షారీ షెప్దామనీ’
‘నాకు సారీ చెప్తావా? ఎందుకు?’
‘నేను నీకు అబద్ధం షెప్పానన్నా’
‘నాకబద్ధం చెప్పావా? ఎప్పుడు?’
‘టూదౌజెండ్ ఎయిట్‌లో’
‘అప్పుడెప్పుడో సంగతి ఇప్పుడెందుకులే - పడుకుని నిద్రపో’
‘ఏయ్ - పడుకుని నిద్రపో అంషే ఏంషర్ధం? నేను మందు కొష్షాననా? ఇగో- నేను పది పెగ్గులు కొట్టినా ‘స్టడీ’ తెల్షా?’
‘తెలుసులే - ఇంక పడుకో’
‘నో - ముందు నన్ను షమించానను’
‘నువ్వేం చేశావసలు’
‘అబద్ధం చెప్పాన్నీకు - టూదౌజెండ్ ఎయిట్‌లో’
‘ఓకే క్షమించానే్ల - ఇంక పడుకో’
‘ఏయ్ - అదే వొప్పుకోను. కారణం తెలుషుకోకుండా షమించానే్ల అని ఎలా అంటావ్‌బే - బేవకూఫ్ సాలే’
‘ఓకే కారణం చెప్పు’
‘నేన్నీకు అబద్ధం షెప్పాను’
‘ఏం అబద్ధం?’
‘నీ మారేజ్ డే నాడు - నేను మందుకొట్టి వచ్చాను. అప్పుడు నువ్వడిగావ్ - అలా నడుస్తున్నావేంట్రా - మందుకొట్టావా అని. దానికి నేను ‘్ఛట్ - మందు తాగటం ఎప్పుడో మానేశానని అబద్ధం చెప్పా’
‘సరేలే అయిందేదో అయిపోయింది కదా - ఇంక పడుకో’
‘ఏయ్ - నువ్ షమించాననకపోతే ఊరుకోను - మీ ఇంటికొస్తా నిప్పుడు’
‘క్షమించానే్లరా’
‘నో - నువ్ మనస్ఫూర్తిగా అంషం లేదు’
ఇలా రాత్రంతా సాగిపోతుంది.
ఇంకోడు మందు కొట్టాడంటే చాలు భోరున ఏడుస్తూంటాడు - తెల్లారేవరకూ!
ఇంకో రకం మందు కొట్టగానే పెళ్లాం బిడ్డల్ని చావగొట్టి ఇంటి నుంచి బయటగ్గెంటేస్తూంటారు.
మరో రకం మందేశ్వర్రావ్‌లు ఫ్రెండ్స్‌తో ఫైటింగ్‌కి దిగుతారు.
‘అన్నా! నువ్ నా బెస్ట్‌ఫ్రెండ్‌వే! నా ప్రాణం అనుకోరాదు. కానీ నువ్వేం చేశావ్‌రా బాడుకవ్! ఆ రాజేష్‌గాడితో కుమ్మక్కై నన్ను మోసం జేసినావ్’
ఇద్దరూ బార్‌లోనే ఫైటింగ్ చేసేసి హాస్పిటల్లో చేర్తారు.
ఈ మందు అట్రాక్షన్ గమనించే మన పాలకులు ‘బార్లకు’ గేట్లు బార్లా తెరిచేశారు.
ఒక పెగ్గు కొంటే రెండోది ఫ్రీ! అయిదు కొంటే ఆరు ఫ్రీ’
‘ఈ పబ్లిక్ ఖతర్‌నాక్ బ్రదర్! కనీసావసరాలు సమకూర్చమనీ, జీతాలు పెంచమనీ, ఉద్యోగాలు కావాలనీ, న్యూసెన్స్ చేస్తారు. అందుకని వాళ్ల నోరు మూయించడానికి వాళ్లకు మందు అలవాటు చేయాలి. ప్రతి పౌరుడు ఒక మందేశ్వర్రావ్ అయితే మనకిక వర్రీ ఉండదు’ అనుకుంటారు వాళ్లు మందు కొట్టి -
అందుకే ఈ రోజుల్లో మందు కొట్టని వాడు లక్షకు ఒక్కడు కనపడతాడు. ‘మందు’ అనేది మనం రోజూ తాగే మంచినీళ్లలా అయిపోయింది.
ఒక స్వామీజీ ‘మందు’కి వ్యతిరేకంగా ఓ భక్త బృందానికి ఉపన్యాసం ఇచ్చారు.
మీటింగవగానే భక్తులు ఆయనకు పాలు తెచ్చారు.
‘నేను పాలు తాగన్నాయినా!’
భక్తులు పాలల్లో హార్లిక్స్ కలిపి తెచ్చారు.
‘హార్లిక్స్ తాగన్నాయనా’
‘కొబ్బరి బొళ్లాం నీరు ఇమ్మంటారా స్వామీ?’
‘వద్దు నాయినా?’
‘పోనీ మజ్జి షుగర్ ఇమ్మంటారా స్వామీ?’
‘నేనది తాగన్నాయినా’
‘పోనీ సోడా తాగుతారా?’
‘అస్సలు తాగను - వట్టి విస్కీయే - అందులో ఏదీ కలపకండి నాయినా’

No comments:
Post a Comment