PLEASE FEEL FREE TO CLICK ON THE ADS! --- దయ చేసి భయపడకుండా ప్రకటనల మీద క్లిక్ చేయగలరు

Saturday, April 14, 2012

ప్రభాస్ అయితే ఆమెకు బాగా సరి పోతాడట.....!!

బొంగులో వార్త:

Jwala Guttaబ్యాడ్మింటన్ బామ జ్వాలా గుత్తా సినిమాల్లో నటించడానికి రెడీ అని మరోసారి అన్నట్లు ఓ టీవీ లో వార్త వచ్చింది. సినిమాల్లో నటించడానికి తాను రెడీ గా ఉన్నానని ఆమె చెప్పింది. ప్రభాస్ అయితే తనకు సినిమాల్లో సరిజోడు అవుతాడని ఆమె అంటోంది. తనకు యాక్షన్ సినిమాలంటే ఇష్టమని చెప్పింది. గతంలో 2010 అక్టోబర్‌లో కూడా తాను సినిమాల్లో నటించడానికి సిద్ధ్గా ఉన్నట్లు చెప్పింది.

అప్పుడు ఆ వార్తతో ప్రభాస్ హీరోగా నటిస్తున్న రెబెల్ చిత్రం కోసం ఆమెను సంప్రదించారు. ప్రభాస్‌ అంటే తనకు చాలా ఇష్టమని చెప్పిన జ్వాలా ప్రకటన వారికి అందుకు అవకాశం ఇచ్చింది.అవకాశం వస్తే ప్రభాస్ సరసన నటిస్తానని ఆమె చెప్పింది. అయితే అది వర్కవుట్
అయినట్లు లేదు. రెబెల్ సినిమా నిర్మాణం ఇంకా సాగుతూనే ఉన్నది.

రెబెల్ నిర్మాతలు సంప్రదిస్తే ఆమె అంగీకరించడానికి కూడా దాదాపు సిద్ధపడినట్లు వార్తలు వచ్చాయి. అయితే, అనూహ్యంగా పార్లమెంటు సభ్యుడు, భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మొహ్మద్ అజరుద్దీన్ అడ్డు వచ్చాడని వార్తకథనాలు వచ్చాయి. ప్రభాస్‌తో జ్వాలా నటించడానికి అజర్ అంగీకరించలేదంటూ ఓ వార్త వచ్చింది.

జ్వాలా గుత్తా అజరుద్దీన్ కుటుంబానికి అత్యంత సన్నిహితురాలు. జ్వాలా, అజర్ మధ్య అఫైర్ నడుస్తున్నట్లు పెద్ద యెత్తున మీడియాలో అప్పట్లో ఊహాగానాలు చెలరేగాయి. దానివల్లనే జ్వాలా గుత్తాకు, చేతన్ ఆనంద్‌కు మధ్య విభేదాలు వచ్చి విడాకులు తీసుకున్నట్లు చెబుతారు.

జ్వాల గుత్తా హైదరాబాదులో పుట్టి పెరిగింది. ఆమె తండ్రి భారతీయుడు కాగా, తల్లి చైనాకు చెందిన మహిళ. జ్వాల తాత మహాత్మా గాంధీ శిష్యుడు. బాడ్మింటన్ క్రీడాకారుడు చేతన్ ఆనంద్ ను జ్వాల 1999లో వివాహం చేసుకుంది. అయితే వారిద్దరు ఇటీవలే విడాకులు తీసుకున్నారు. హైదరాబాదుకు చెందిన భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, పార్లమెంటు సభ్యుడు మొహ్మద్ అజరుద్దీన్ తో జ్వాల డేటింగ్ చేసినట్లు ప్రచారం జరిగింది. ఈ ప్రచారాన్ని అజర్ తో పాటు జ్వాల కూడా ఖండించారు.

No comments:

Popular Posts

Desclaimer: Please note this Blog is only video embeddeding Blog. all of the news articles, videos and photos found here come from 3rd party video and news hosting sites. We do not host any of the videos and news articles. Please contact us through mail for any copyright issues.