బొంగులో వార్త:
పాకిస్థాన్‌లోని ఖైబర్ పఖ్తుక్వా ప్రొవీన్స్‌లోని ఓ జైలుపై తాలిబన్ తీవ్రవాదులు మెరుపు దాడి చేశారు. ఈ దాడితో జైలులో ఉన్న ఖైదీల్లో 400 మంది పారిపోయారు. ఈ దాడి తాలిబన్ బలాన్ని చాటిందని పాకిస్థాన్ డైలీ ఒకటి పేర్కొంది. ఈ తరహా దాడి మళ్లీ జరుగవచ్చని ఆ పత్రిక ఓ వార్తా కథనాన్ని ప్రచురించింది.
న్యూస్ ఇంటర్నేషనల్ అనే వార్తా పత్రిక సోమవారం సంచికలో ఎడిటోరియల్ పేజీలో ఈ కథనాన్ని ప్రచురించింది. ఈ ప్రొవీన్స్‌లోని బన్ను జైలుపై తాలిబన్ తీవ్రవాదులు మెరుపు దాడి చేయడం వల్ల 384 మంది ఖైదీలు తప్పించుకుని పారిపోయారని, ఇదే తరహా దాడి పునరావృత్తం కావొచ్చని ఆ కథనం పేర్కొంది.
జైలుపై మెరుపుదాడి చేసిన తాలిబన్ తీవ్రవాదుల చేతుల్లో భారీ ఆయుధాలు, శక్తివంతమైన పేలుడు పదార్థాలు, రాకెట్ ప్రోపెల్డ్ గ్రెనైడ్ (ఆర్‌పీజీ) వంటి అత్యాధునిక ఆయుధాలు ఉండటం వల్లే తొలుత జైలు ప్రధాన గేటుతో పాటు.. ద్వారం గోడలను పేల్చివేసి, జైలు సిబ్బందిని తమ అదుపులోకి తీసుకున్నారని ఆ పత్రిక పేర్కొంది. గతంలో ఈ తరహా ఆపరేషన్ ఎన్నడూ జరగలేదని తెలిపింది. అయితే, 18 నెలల క్రితం ఆప్ఘనిస్థాన్‌లోని కాందహార్ జైలు గోడలు బద్ధలు కొట్టారని పేర్కొంది.

No comments:
Post a Comment