బొంగులో వార్త:
తారా చౌదరి కేసు అటు తిరిగి ఇటు తిరిగి రాష్ట్రంలోని కొంతమంది నాయకుల మెడకు చుట్టుకునేట్లుగా కనబడుతోంది. తారా చౌదరి చెపుతున్న మాటలను చూస్తే... ఇది నూటికి నూరుపాళ్లు నిజమేననిపిస్తోంది. వ్యవహారం చూస్తుంటే రాజస్థాన్ రాష్ట్రంలో జరిగిన భన్వరీ దేవి ఎపిసోడ్ గుర్తుకు తెస్తోంది. కాకపోతే అక్కడ భన్వరీదేవి పోలీసుల రక్షణ లేక హత్యకు గురయింది.
ఇక్కడ తారా చౌదరి మాత్రం పోలీసుల రక్షణలో ఉన్నది. అయినప్పటికీ తనకు ప్రాణభయం ఉన్నదని ఆందోళన వ్యక్తం చేస్తోంది. ముగ్గురు నాయకుల నుంచి తనకు ముప్పు పొంచి ఉన్నదని అంటోంది. వారి పేర్లను, సాక్ష్యాధారాలతో సహా సీబీఐ లేదా హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి ముందు బహిర్గతం చేస్తానని నొక్కి వక్కాణిస్తోంది. తార ఇంతగా చెపుతోందంటే నాయకులకు సంబంధించిన డేటా చాలా బలంగానే తార వద్ద ఉన్నట్లు తేటతెల్లమవుతోంది.
ఎక్కడో ప్రకాశం జిల్లాలోని పామూరుకు చెందిన ఈ తారా చౌదరి చిన్నచిన్న పాత్రలను చేస్కుంటూ అవి వర్కవుట్ కాకపోయేసరికి వేరే రూట్‌లోకి వెళ్లింది. అలా వెళ్లిన ఆమె అనతికాలంలో బిగ్‌బాస్‌ల కంట్లో పడింది... కాదుకాదు... వారే ఆమెను వెతుక్కుంటూ వచ్చారన్నది తార మాట. తనను బెదిరించి వాడుకున్నారంటూ తారా చౌదరి చెపుతోంది.
నాలుగు రోజుల కస్టడీకి తీసుకున్న పోలీసులు మంగళవారం సాయంత్రం హైదరాబాదులోని తారా చౌదరి ఇంట్లో సోదాలు చేశారు. కొన్ని సీడీలు, హార్డ్‌డిస్క్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటికే తార వద్ద నుంచి కీలకమైన సమాచారాన్ని రాబట్టినట్లు తెలుస్తోంది.
ఐతే బంజారా హిల్స్ పోలీసులు తనను వేధిస్తున్నారని తారా చౌదరి చెపుతోంది. కానీ తారా చౌదరి నుంచి రాబడుతున్న విషయాలను తెలుసుకుంటుంటే ఆమె బ్యాక్‌గ్రౌండ్ ఏ స్థాయిలో ఉన్నదో అర్థమవుతుందంటున్నారు. తార ఎక్కడికెళ్లినా.. ఆఖరికి ఏడుకొండలవాడి ఆలయానికి వెళ్లినా ప్రత్యేక దర్శనానికి ఇట్టే అనుమతి లభించేదట. అంతేకాదు... చిన్నచిన్న దేవాలయాల సంగతైతే ఇక చెప్పక్కర్లేదు. నేరుగా గర్భ గుడిలోకే ప్రవేశం.
అలాగే ఒంగోలు లోని అచ్చమాంబ దేవాలయానికి వెళ్లినప్పుడు తారా చౌదరిని అక్కడి అధికారి నర్శింహులు అడ్డగించారట. ప్రతిసారీ వీఐపి దర్శనం కుదరదని తెగేసి చెప్పేసరికి కోపోద్రిక్తురాలైన తారా చౌదరి ఆయనను హత్య చేయించేందుకు పథకరచన చేసిందట. ఐతే ఆలోపే పోలీసులు అరెస్టు చేయడంతో కథ అడ్డం తిరిగింది.
ఇకపోతే తారా చౌదరి ఆదాయం అంతా వ్యభిచారం.. బ్లాక్‌మెయిలింగ్ ద్వారానే రాబట్టినట్లు తెలుస్తోంది. అలా ఆర్జించిన ధనంతో హైదరాబాదులోని ఎల్వీ ప్రసాద్ హాస్పిటల్ వెనుక ఓ ఖరీదైన ప్లాటును, ఇంకా బెంగళూరులో పెద్ద ఇంటిని, హైదరాబాదు శివార్లలో భూములను కొనుగోలు చేసినట్లు విచారణలో తేలినట్లు సమాచారం.
తనతో ఓ ఎంపీ, ఓ మంత్రి, ఓ సినీస్టార్ టచ్‌లో ఉంటుంటారని తార పోలీసుల వద్ద వెల్లడించినట్లు సమచారం. కాకపోతే తనకు ముప్పు ఏర్పడుతుందని భయపడే కొంతమంది నాయకుల రాసలీలలు షూట్ చేసినట్లు పోలీసుల ఎదుట తారా చౌదరి నోరు విప్పినట్లు తెలుస్తోంది. ఐతే డీజీపి, హోంమంత్రి రక్షణ కల్పిస్తే మరిన్ని నిజాలు చెపుతానని తారా చౌదరి మీడియా ముందు చెప్పడాన్ని చూస్తుంటే వ్యవహారం చాలా పెద్దదే అన్నట్లుగా కనిపిస్తోంది. మొత్తమ్మీద పోలీసుల కస్టడీలో ఉన్న తారా చౌదరి అది పూర్తయ్యే నాటికి మరెందరు చీకటి బతుకులను బజారుకీడుస్తుందో చూడాలి...

No comments:
Post a Comment