`పారం చెప్పటం’ వేరు. గుణపాఠం చెప్పటం వేరు.
ఈ రెండూ కాకుండా, ‘క్లాసు పీకటం’ వేరు.
అనగనగా ఓ అందమైన ఆడపిల్ల. ఆమె వెంట ముగ్గురు.
ప్రేమించానూ, ప్రాణమిచ్చేస్తానూ- అంటాడొకడు. ‘ఎన్నున్నాయిరా, నీ దగ్గర ప్రాణాలు, ఇలా నచ్చిన ప్రతి పిల్లకూ ఇచ్చుకుంటూ పోవటానికీ’, అని, ‘కాఫీ డే’లో వెచ్చని కాఫీ తాగించి చెబుతుంది. ఇది పాఠం.
‘‘ఏయ్ పిల్లా లిఫ్టుకావాలా?’- అంటూ అని రోజూ బసుస్టాండు దగ్గరకొస్తాడు ఒక ‘బైకు’బాబు. ‘ఈ పూట మా అక్కయ్యకివ్వు,
రేపు నేను ఎక్కుతాలే.’అని ఒక ఆడా, మగా కానీ మాడా (హిజ్రా)ను ఎక్కిస్తే- ఇది గుణపాఠం.
మూడోవాడుంటాడు. ప్రేమించడు, వేధించడు. ఆమె ఎక్కడికొస్తే, అక్కడికొస్తాడు. ఆమె పిజ్జా తింటుంది, వాడూ పిజ్జాతింటాడు. చిత్రం. ఆమె లిప్‌స్టిక్ కొంటే, వాడూ లిప్‌స్టిక్ కొంటాడు.
వాడినేమీ చెయ్యలేక ‘నేను పిజ్జాతినటం మానేస్తున్నాను, లిప్‌స్టిక్ పెట్టుకోవటం మానేస్తున్నాను. నువ్వు మానెయ్యి.’ అంటుంది. కానీ ముందు తను మానాలి కదా!. ఇదే ‘క్లాసు పీకుడు’.
పాఠమైనా, గుణపాఠమైనా, మార్పుకోసం.
కానీ, క్లాసు పీకుడు, యధాతథ స్థితికోసం.
పాఠం మిత్రులకు చెబుతాం, గుణపాఠం శత్రువులకు చెబుతాం.
మిత్రులూ, శత్రువులూ కానీ సన్నిహితులు వుంటారా? ఉంటారు. వారే మన నీడలు.
మిత్రుడూ మారొచ్చు. శత్రువూ మారొచ్చు. కానీ నీడ మారదు. మనం మారకుండా. మన నీడలు మారాలనే దురాశలోనుంచే ఈ ‘క్లాసు పీకుడు’ పుట్టింది.
రాజకీయాల్లో ఎలాగూ శాశ్వత మిత్రులూ, శత్రువులూ వుండరని, ఏనాడో అనుభవజ్ఞులు అన్నారు.
అందుకనే, ఆ స్థానంలో పార్టీల అధినేతలు తమ నీడల్ని ప్రవేశపెట్టారు. ముందు బాగానే వుంటుంది. తర్వాత తమ నీడల మీద, తమకే విసుకు వస్తుంది.
ఈ సంకటం ప్రతి పార్టీ అధిష్ఠానానికీ వస్తుంది. ఈమధ్య కాంగ్రెస్ అధిష్ఠానానికి వచ్చింది. ఈ అధిష్ఠానానికి రాష్ట్రంలో మూడు నీడలున్నాయి. ఆ నీడల మధ్య సయోధ్య లేదు.
ఒక వ్యక్తికి ఎక్కడయినా మూడు నీడలు వుంటాయా? మూడేం ఖర్మ, ముప్ఫయి మూడు నీడలుంటాయి. ఆ వ్యక్తిమీద ఎన్ని టార్జిలైట్లు పడితే అన్ని నీడలుంటాయి.
ఒకప్పుడు ఒకే నీడ వుండేది. కారణం అధిష్ఠానం మీద ఒకే లైట్ పడేది. అధిష్ఠానం నమస్కరిస్తే, ఆ నీడా నమస్కరించేది. ‘అశేష జనవాహిని’ ముందు అధిష్ఠానం చెయ్యి ఊపితే, నీడా చెయ్యి ఊపేది. ఆ నీడ పేరు వై.యస్.రాజశేఖరరెడ్డి.
తప్పు, అధిష్ఠానం చెయ్యి ఊపినప్పుడు, నీడ వినమ్రంగా చేతులు జోడించి నిలబడాలి.
అందుకే, ఆ నీడ స్థానంలో పలు నీడల్ని తేవాలనుకున్నది అధిష్ఠానం. తన మీద ఎక్కువ లైట్లు ఫోకస్ చేయించుకున్నది. పలు నీడలు వచ్చాయి. వాటిలో చాలా లైట్లు వెలిగి ఆరిపోగా మూడు లైట్లు మిగిలాయి. దాంతో మూడే నీడలు మిగిలాయి.
వాటి పేర్లే- ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, పీసీసీ నేత బొత్స సత్యనారాయణ, ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనరసింహ.
ఇంకా చెప్పాలంటే, ఒకరు: చెక్. ఇంకొకరు: క్రాస్ చెక్, మరొకరు: కౌంటర్ చెక్.
అధికారాన్ని వాడుకుని మహావృక్షాలుగా ఎదిగిపోతున్న వారి ఆటకట్టించటానికి ఒకరూ, వృక్షాలకు బదులు మొక్కల్ని పీకేయకుండా చూడకుండటానికి ఇంకొకరు, తేడావస్తే, చెట్లు పీకే వ్యక్తినే పీకేయగలనని చెప్పటానికీ ఇంకొకరు- అని అర్థం చేసుకోవాలి. అసలు నీడలకు ఇచ్చిన బాధ్యతలే కొట్టుకుచచ్చేవయితే, ఆ నీడలమధ్య సఖ్యత ఎలా వుంటుంది?
నీడలు మారాలంటే అధిష్ఠానం వైఖరి మారాలి.
అధిష్ఠానానికి వున్న ఉద్దేశ్శాలు మారాలి.
ఇవేమీ మారకుండా, నీడలు మారిపోవాలన్న అత్యాశలో భాగంగానే ఈమధ్య ఈ మూడు నీడల్నీ ఢిల్లీ పిలిపించి పార్టీ అధిష్ఠానం తరపున రాష్ట్ర వ్యవహారాల బాధ్యులు గులామ్ నబీ అజాద్ ‘క్లాసు పీకారు’.
అనగా, ‘మేం మారాం కానీ, మీరు మాత్రం మారండి’ అని మూడు నీడలకీ చెప్పారు.
మూడు నీడలూ మూడు వేరువేరు కారుల్లో వచ్చినప్పుడు ఆయన బాధపడ్డారు. ఇలాచేస్తే సయోధ్య లేదన్న ‘కారుకూతలు’ ఎక్కువ అవుతాయన్నారు. అందుచేత, పంపించేటప్పుడు ముగ్గుర్నీ ‘ఒకే కారు’లో ‘ఎ.పి.్భవన్’కు పంపించారు.
నీడల ఐక్యత ఎంతసేపు వుంటుంది? లైట్లు పడని కొన్ని గంటలుంటుంది. ఆ తర్వాత లైట్లుపడ్డాయి.
మళ్ళీ మూడు నీడలూ, మూడు వేర్వేరు విమానాల్లో, మూడు వేర్వేరు వేళల్లో రాష్ట్రానికి చేరుకున్నాయి.
‘క్లాసు పీకుడు’ అలా పనిచేస్తుంది.
జరిగిన ఏడు స్థానాల ఉప ఎన్నికల వోటమికి ఏ నీడను నిందించినా, అధిష్ఠానం తననుతాను నిందించుకున్నట్టే.
రేపు జరగబోయే 18 స్థానాల్లో సగానికి సగమయినా తేవాలని నీడలకు ‘టార్గెట్’ పెట్టిందనుకోండి. అధిష్ఠానం తనకుతాను టార్గెట్ పెట్టుకున్నట్టే.
కాబట్టి, ఒక నేత నీడలకు ‘క్లాసు పీకితే’ తన్నుతాను కొరడాతో కొట్టుకున్నట్లే.

2 comments:
wow, chala baga raasaru. You are great!
Ravi, Super ga undi. Nee talentuki naa joharlu. Keep it going ...
Post a Comment