బొంగులో వార్త:రాజ్‌కోట్, ఏప్రిల్ 6: గుజరాత్‌లోని బిజెపి నేతల అత్యుత్సాహం ముఖ్యమంత్రి నరేంద్ర మోడీని వివాదంలోకి నెట్టింది. కృష్ణ యాత్ర సందర్భంగా బిజెపి అమ్రేలీ జిల్లా శాఖ దినపత్రికల్లో ఒక అడ్వర్‌టైజ్‌మెంట్ ఇచ్చింది. అంతదాకా బాగానే ఉంది. శ్రీకృష్ణ భగవానుని స్థానంలో ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ బొమ్మ ముద్రించడం వివాదాస్పదమైంది. గుజరాత్ రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు ఆర్‌సి ఫాల్డుని అర్జునుడిగా యాడ్ వచ్చింది. అలాగే పార్టీ నేతలు విజయ్ రూపానీ, పురుషోత్తం రూపాల, ఐకె జడేజాలను పాండవుల స్థానంలో ఉంచిన అయిన యాడ్ పత్రికలో అచ్చయింది. రాష్ట్ర అధ్యక్షుడి సారధ్యంలో సాగే కృష్ణయాత్రను ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించారు. సౌరాష్ట్ర ప్రాంత రైతాంగంలో ఆధునిక వ్యవసాయ పద్ధతులతో అధిక దిగుబడులు సాధించేలా అవగాహన తేవాలని ఈ యాత్రను ఉద్దేశించారు. యుపిఏ రైతు వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్టు ఫాల్డు మీడియాకు చెప్పారు.
No comments:
Post a Comment