PLEASE FEEL FREE TO CLICK ON THE ADS! --- దయ చేసి భయపడకుండా ప్రకటనల మీద క్లిక్ చేయగలరు

Wednesday, April 4, 2012

సీపీఎం మహాసభలు నేటి నుంచే

బొంగులో వార్త:
కోజికోడ్: సీపీఎం 20వ మహాసభలు కేరళలోని కోజికోడ్‌లో బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఆరు రోజుల పాటు జరిగే ఈ మహాసభల్లో చర్చించాల్సిన అంశాలపై, భవిష్యత్ కార్యాచారణ ప్రణాళికపై పార్టీ ముసాయిదా తీర్మానాన్ని రూపొందించింది. నయా ఉదారవాద విధానాల వల్ల జరుగుతున్న నష్టాలపై చర్చించి, దేశంలో ప్రజల ప్రజాస్వామ్యం ఏర్పాటు లక్ష్యంగా కార్యాచరణను రూపొందించాలని ముసాయిదాలో పేర్కొన్నారు. చెన్నైలో జరిగిన 14వ మహాసభల అనంతరం మొదటిసారిగా సైద్ధాంతిక అంశాలపై చర్చించాలని తీర్మానించారు. దీన్ని పార్టీ సభ్యులకు పంపిణీ చేసి, సభల్లో చర్చించిన అనంతరం సవరణలను చేపడతామని పార్టీ నాయకుడొకరు చెప్పారు. పెట్టుబడిదారీ విధానంపై లాటిన్ అమెరికా, యూరప్ దేశాల్లో వెల్లువెత్తిన నిరసనలను, ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన ‘ఆకుపై వాల్‌స్ట్రీట్’ ఉద్యమాన్ని కూడా ముసాయిదాలో పేర్కొన్నారు.

పొలిట్‌బ్యూరోనుంచి వైదొలుగుతా!

పశ్చిమ బెంగాల్, కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయంపై ప్రధానంగా చర్చిస్తున్న ఈ మహాసభలకు పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్య గైర్హాజరయ్యే అవకాశముంది. బెంగాల్‌లో ఓటమి అనంతరం ఆయన పార్టీ ముఖ్యమైన సమావేశాలకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. మహాసభలకు హాజరుకావాలని పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రకాష్ కారత్ స్వయంగా పిలిచినప్పటికీ బుద్ధదేవ్ సున్నితంగా తిరస్కరించినట్లు తెలిసింది. పార్టీ కేంద్ర కమిటీతోపాటు పొలిట్‌బ్యూరో నుంచి తాను తప్పుకోవాలని భావిస్తున్నట్లు కారత్‌కు లేఖ రాశారని ప్రచారం జరుగుతోంది.

No comments:

Popular Posts

Desclaimer: Please note this Blog is only video embeddeding Blog. all of the news articles, videos and photos found here come from 3rd party video and news hosting sites. We do not host any of the videos and news articles. Please contact us through mail for any copyright issues.