బొంగులో వార్త:
వాషింగ్టన్: అమెరికాలో సహచర విద్యార్థులపై ఓ ఉన్మాది విచక్షణారహిత కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో రింజింగ్ భూటియా అనే భారతీయుడితో సహా ఏడుగురు మృతి చెందారు. చనిపోయిన ఈ విద్యార్థి సిక్కింకు చెందిన వ్యక్తి. మరో ముగ్గురు విద్యార్థులు తీవ్రగాయాలతో ఆస్పత్రి పాలయ్యారు. దేవీందర్ కౌర్ అనే భారతీయ విద్యార్థినికి మోచేతి వద్ద బుల్లెట్ గాయమైంది. క్యాలిఫోర్నియా రాష్ట్రం, ఓక్లాండ్ నగరంలోని క్రిస్టియన్ కాలేజీలో ఈ దారుణం జరిగింది.
తన ఇంగ్లిష్ భాషా నైపుణ్యంపై తోటి విద్యార్థులు వేసిన జోకుల్ని భరించలేకపోయిన వన్ ఎల్ గోహ్(38) అనే ఉన్మాది ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. సోమవారం ఉదయం అతను కళాశాలలోకి ప్రవేశించాడు. ఓ తరగతి గదిలోకి ప్రవేశించాడు. విద్యార్థులందరినీ లేచి గోడకు అభిముఖంగా వరుసలో నిలబడమని చెప్పాడు. కొందరు అతను చెప్పినట్టు చేయకపోవడంతో తుపాకీతో విచక్షణారహితంగా కాల్పులు ప్రారంభించాడు.
అందరూ ప్రాణభయంతో అరుస్తూ పరుగులు తీశారు. వారిలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరు ఆస్పత్రిలో చనిపోయారు. కాగా భారతీయ విద్యార్థి అయిన భూటియా రాత్రిళ్లు విమానాశ్రయంలోనూ రెస్టారెంట్లలోనూ పనిచేస్తూ పగలు కాలేజీలో నర్సింగ్ కోర్స్ చేస్తున్నాడని, అతను ఎంతో తెలివైనవాడని, మంచివాడని అతని స్నేహితులు కంటతడి పెట్టారు. కాల్పులు జరిపిన వన్‌గోహ్ కాలేజీకి కొద్దిమైళ్ల దూరంలోని ఒక దుకాణం వద్ద పోలీసులకు లొంగిపోయాడు.
కొరియన్-అమెరికన్ అయిన వన్‌గోహ్ ఆ కాలేజీ పూర్వవిద్యార్థేనని, అతడి ప్రవర్తన బాలేదనే కారణంతో జనవరిలో అతణ్ని కళాశాల నుంచి బహిష్కరించినట్టు పోలీసులు వివరించారు. ఆ కోపంతోనే సోమవారం ఉన్నట్టుండి వచ్చి ఇంత దురాగతానికి పాల్పడ్డాడని తెలిపారు.

No comments:
Post a Comment