PLEASE FEEL FREE TO CLICK ON THE ADS! --- దయ చేసి భయపడకుండా ప్రకటనల మీద క్లిక్ చేయగలరు

Thursday, April 5, 2012

2014 ఎన్నికలకు జూనియర్ ఎన్టీఆర్... హరికృష్ణ

బొంగులో వార్త: గురువారం, 5 ఏప్రిల్ 2012: రానున్న ఎన్నికలు తెలుగుదేశం పార్టీకి లైఫ్ అండ్ డెత్ సమస్యగా ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు నందమూరి హరికృష్ణ అభివర్ణించారు. 2014 ఎన్నికల్లో తమ పార్టీని అధికారంలోకి తేవడానికి అమితంగా కృషి చేస్తున్నామన్నారు. ఒకవేళ పార్టీ గనుక ఆదేశిస్తే ఎన్నికల ప్రచారంలో తన తనయులు జూనియర్ ఎన్.టి.ఆర్., కల్యాణ్ రామ్‌లు పాల్గొంటారని తెలిపారు. తన బావ చంద్రబాబునాయడుకు తనకు మధ్య ఎలాంటి విభేదాలు లేనే లేవని చెప్పుకొచ్చారు. తమ ఇద్దరికి మధ్య అభిప్రాయబేధాలు పెచ్చుమీరుతున్నాయంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదన్నారు. కృష్ణా, ఖమ్మం జిల్లాల్లో పర్యటిస్తున్న హరికృష్ణ ఒక మీడియా ఛానల్‌తో మాట్లాడుతూ తెదేపాను తమ ఆడపడుచుగా అభివర్ణించారు. సోదరులుగా తాము ఎప్పుడూ ఆమె క్షేమాన్నే కోరుకుంటామన్నారు. పార్టీకీ మునుపటి వైభవాన్ని తీసుకురావడానికి యావత్ నందమూరి కుటుంబం అంతా సమష్టిగా పనిచేస్తుందని తెలిపారు. తమ కృషి వల్ల రాష్ట్రంలో పార్టీకి అధికారం ప్రాప్తిస్తుందని తిరిగి రామన్న రాజ్యం వస్తుందన్నారు. తెలంగాణపై పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని, తాను వ్యక్తిగతంగా రాష్ట్ర ప్రజల మనోభావాలను గౌరవిస్తానని తెలిపారు. తనకు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలూ సమానమేనని, ఎన్టీఆర్ కుమారుడిగా రాష్ట్ర ప్రజల మనోభావాలకు అనుగుణంగా ప్రవర్తించడం తన బాధ్యతని పేర్కొన్నారు. కాంగ్రెస్ పాలనలో ప్రజలు నానా యాతనలు పడుతున్నారని, అన్నిరకాల వస్తువుల ధరలు ఆకాశానికంటి రాష్ట్రవాసులు అల్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

1 comment:

Anonymous said...

Neeyabba...,dhochukondi raa inika ennallu thatha manavallu.. aa tharuvaatha muni manavallu kooda vasthaaru.

Popular Posts

Desclaimer: Please note this Blog is only video embeddeding Blog. all of the news articles, videos and photos found here come from 3rd party video and news hosting sites. We do not host any of the videos and news articles. Please contact us through mail for any copyright issues.